English | Telugu
వామ్మో మీ డామినేషన్.. మగవాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది!
Updated : Feb 2, 2024
ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ సూడలా.. ఎస్ ఓ మనిషి మాస్క్ తో ఉన్నాడా? నిజంగా ఉన్నాడా ఎలా తెలుసుకుంటాం. అతని ప్రవర్తన, అతను మనతో మాట్లాడే మాటలు.. చేసే పనులు అన్నీ చూసుకొని మనం అతనిపై ఓ అంచనాకి వస్తాం. అలా బిగ్ బాస్ హౌస్ లో ఓ వందరోజులు ఉన్న మనిషిని దాదాపు కొన్ని కోట్ల మంది చూసారు. వారందరికి హౌస్ లో ఎవరేంటో తెలిసిపోతుంది. కొందరు బయటకొచ్చాక నేను మంచిదాన్ని నన్ను నెగెటివ్ గా చూపించారని అనుకుంటున్నారంటూ ఓ ఇంటర్వూలో ప్రియాంక అంది.
ప్రియాంక జైన్ టాప్-5 కంటెస్టెంట్ గా నిలిచింది. పొట్టిపిల్ల గట్టిపిల్లగా హౌస్ లో శివంగిలా ఆడిన ప్రియాంక తన సత్తా చాటుకుంది. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.
ప్రస్తుతం తను ఓ ఇంటర్వూలో పాల్గొని హౌస్ లో జరిగిన కొన్ని విషయాలని షేర్ చేసింది. స్పా బ్యాచ్ బయట ఎందుకు కలవట్లేదని క్వశ్చన్ అడుగగా.. ఎప్పుడో ఒకసారి మేము కలుస్తాం. హౌస్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యామని ప్రియాంక అంది. శివాజీ గారి గురించి చెప్పండని అడుగగా.. శివాజీ గారు చాణక్య అంతే.. ఆయన మాస్క్ తో ఉన్న మాస్టర్ మైండ్. హౌస్ లో బయటపడలేదు.. ఇంకెప్పుడు బయటపడడని అంది. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఓకేనా అనగా.. ఒకే .. మొదట అతనిది యాక్టింగ్ అనిపించింది వెళ్ళే కొద్దీ అతడితో స్నేహం కుదిరింది. మంచివాడు వాడు విన్నర్ గా అర్హుడే అని ప్రియాంక జైన్ అంది. అమర్ దీప్ తో మీ ఫ్రెండ్ షిప్ గురించి చెప్పండి అని అడుగగా.. తను నాకు జానకి కలనలేదు సీరియల్ తో పరిచయం. మేం షూటింగ్ లోనే కలుస్తాం.. మాట్లాడుకుంటాం అంతేకానీ ఎక్కువగా కలవమని అంది. ఇలా హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎవరెలా ఉన్నారో.. ఎవరేంటో చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ వీడియోకి నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. " మీరేంటో బిబి హౌస్ లో చూపించారు అక్క. మళ్ళీ నీ కోసం మీరెన్ని చెప్పినా నమ్మము అక్క.. వామ్మో మీ డామినేషన్ మగవాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది " అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ గా నిలిచింది.