English | Telugu

నువ్వు నా ప్రాపర్టీ...యశ్వంత్ కి శోభా వార్నింగ్!

కార్తీకదీపంలో మోనితగా అందరికీ దగ్గరైన శోభా శెట్టి బిగ్ బాస్ లోకి వెళ్లి దుమ్ము దులిపేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక ఫుల్ బిజీగా మారిపోయింది. అంతేకాదు తన ప్రియుడు యశ్వంత్‏తో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. పనిలో పనిగా కొత్త ఇల్లు కూడా కొనేసుకుంది. కాబోయే అత్తగారిని కూడా కలిసి ఆమెను కూడా చూపిస్తూ ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఇప్పుడు శోభా శెట్టి యశ్వంత్ ని ఇప్పటి నుంచే గ్రిప్ లో పెట్టుకోవడానికి రెడీ ఐపోయింది. తన మనసులో మాటల్ని యశ్వంత్ కి వినిపించేలా వీడియో స్టేటస్ లను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

"నువ్వు నన్ను కాకుండా వేరే అమ్మాయి వైపు చూసావంటే చంపేస్తా..నువ్వు నా ప్రాపర్టీ...నాకు మాత్రమే బెస్టు..గుర్తుపెట్టుకో ..ఇది లవ్ లో ఒక టైపాఫ్ పొసెసివ్నెస్" అంటూ ఒక రీల్ ని ఈ కాప్షన్ ని పోస్ట్ చేసుకుంది. అలాగే తన ఫాంటసీస్ కి దగ్గరగా ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది. "నేనంటే పడి చచ్చిపోవాలి..చాలా బాగా ప్రేమించాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమ చూసి నాకు పిచ్చెక్కిపోవాలి" అని చెప్పింది. ఇక శోభా శెట్టి బిగ్‌బాస్ సీజన్-7 లో టాప్ 6లో ఒక కంటెస్టెంట్‌గా నిలిచింది. జెంట్స్ తో సమానంగా ఆడి తన సత్తా చూపించింది ఈ కన్నడ క్యూటీ బ్యూటీ. ఎంత పాపులారిటీని తెచ్చుకుందో.. అంతే నెగిటివిటీని కూడా సంపాదించుకుంది.. బిగ్ బాస్ హౌస్ లో తన లవర్ గురించి చెప్పింది తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రొపోజ్ చేసింది. అలా యశ్వంత్ కూడా ఆమెకు రింగ్ పెట్టాడు. ఇక త్వరలో వీళ్ళు ఒకింటివారు కాబోతున్నారు. అందుకే ఇప్పటినుంచి శోభా చాలా జాగ్రత్త పడుతోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..