English | Telugu

కుమారి ఆంటీ పిక్ స్పూఫ్...లేడీ గెటప్ లో జెస్సి!


ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఈ వారం షో ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. డాన్సస్ తో పాటు స్కిట్స్ కూడా ఉండే షో ఇది. ఎంటర్టైన్ తో పాటు ఎలిమినేషన్స్ హడావుడితో కాసేపు కంటెస్టెంట్స్ ని టెన్షన్ కూడా పెట్టింది. ఇక ఈ వారం ఎపిసోడ్ లో హైపర్ ఆది కెమెరా మ్యాన్ గా అందరినీ ఫోటోలు తీస్తూ ఫన్ క్రియేట్ చేసాడు. ఇక ఇందులో శ్వేతానాయుడుని ఫొటో తీస్తాను అని చెప్పి స్టేజి మీదకు పిలిచి ఆమెను ఫొటోస్ తీసాడు. ఐతే ఆ ఫొటోస్ సరిగా రాకపోయేసరికి కెమెరా ప్రాబ్లమ్ అనుకున్నా కానీ శ్వేతా నాయుడు మొహమె ప్రాబ్లమ్ అనుకోలేదంటూ ఆమె ఫేస్ గురించి కామెడీ చేసాడు.

తర్వాత ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి ఫిష్ మార్కెట్ లో చేపలు తరిగే అమ్మాయిలా మార్చి స్క్రీన్ మీద చూపించేసరికి అందరూ షాకైపోయి తర్వాత నవ్వేశారు. అలాగే సునంద మాలను కూడా ఫొటోస్ తీసి ఆ ఫోటోని కూడా మార్ఫింగ్ చేసాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కుమారి ఆంటీ పిక్ లా చేసి బ్యాక్ స్క్రీన్ మీద వేసాడు. అలా ఆది కుమార్ ఆంటీ పిక్ స్పూఫ్ తో షోలో ఉన్న అందరినీ నవ్వించేసాడు. "రెండు లివర్ ఎక్కువేస్తే వెయ్యి రూపాయలు" అంటూ కూడా కామెడీ చేసాడు.

తర్వాత జెస్సి ఫోటోని ఒక హీరోయిన్ ఫొటోతో కలిపి మార్ఫింగ్ చేసేసరికి శేఖర్ మాస్టర్ ప్రణీత ఇద్దరూ కలిసి ఆ పిక్ ఒరిజినల్ అనుకుంటా అంటూ కామెడీ చేశారు. ఇక చివరికి ఈ షోలో జెస్సి, శ్రీప్రియ ఎలిమినేషన్ లో ఉండేసరికి మిగతా కంటెస్టెంట్స్ తో ఓట్స్ వేయించాడు హోస్ట్ నందు. ఐతే జెస్సికి కంటెస్టెంట్స్ అంతా ఎక్కువ ఓట్లు చేశారు. డాన్స్ తో పాటు మంచి ఫన్ కూడా చేస్తాడు అని చెప్పారు. ఐతే లాస్ట్ మినిట్ లో శేఖర్ మాష్టర్ ఈ వారానికి ఎలిమినేషన్ లేదని కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఉంటుందని కచ్చితంగా చెప్పారు. ఇలా ఈ వారం షో ఎండ్ అయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.