English | Telugu

మగవాళ్లకు కూడా పింపుల్స్ వస్తాయండి.. పింపుల్స్ పై ఆడవాళ్లకే రైట్స్ ఉన్నాయండి!


యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవి ఏది చేసినా ఎం మాట్లాడినా వెరైటీగా ఉంటుంది. రవికి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొంత కొంటె తనం కూడా ఉంది. రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అందులో మస్త్ స్వీట్ ఖీర్ తింటూ తన నుదిటి మీద వచ్చి పింపుల్ ని చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా "నెక్స్ట్ టైం ఎప్పుడైనా పింపుల్ వస్తే ఈ సాంగ్ ప్లే చేయండి..అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే చిన్న మొటిమ కూడా ముత్యమేలే" అంటూ ప్రేమికుడి మూవీ సాంగ్ ని ప్లే చేసాడు.

ఈ చిన్న మొటిమను బూతద్దంలో చూపిస్తూ మరీ కామెడీగా ఫీలవుతున్నాడు రవి. ఇక ఇది చూసిన నెటిజన్స్ కూడా మస్త్ కామెడీ రిప్లైస్ ఇస్తున్నారు. "పింపుల్స్ పై రైట్స్ టోటల్ గా గర్ల్స్ కే సర్...సర్ మీరు మేడం ఆ అని అడగాలనుకుంటున్నా...అందమైన మిల్క్ బాయ్ లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..నువ్వు అమ్మాయి కాదు..అది బుగ్గ కూడా కాదు... అంటే నువ్వు అందమైన ప్రేమ రాణివా...సూపర్ బ్రో" అంటున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో యాంకర్ రవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రవి సెలవు దొరికితే తన కూతురు వియాతో, వైఫ్ తో కలిసి అన్ని ప్లేసెస్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటాడు . అలాగే రవి వెండితెరపై కొన్ని మూవీస్ లో నటించాడు కానీ అవి పెద్దగా గుర్తింపు తేలేదు. కానీ యాంకర్ గా మాత్రం బాగా పేరు తెచ్చుకున్నాడు. రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో, వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటాడు. తన ప్రాజెక్ట్ అప్ డేట్స్ గురించి కూడా షేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రవి కొన్ని షోస్ కి హోస్టింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.