English | Telugu
దంచవే మేనత్త కూతురా..
Updated : Feb 7, 2024
దివి అంటే చాలు చాలామంది దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య అంటూ ఉంటారు. ఇక దివి కూడా అంతే అందంగా ఉంటుంది. మోడలింగ్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి మూవీస్ లో నటించింది . తరువాత బిగ్ బాస్ ద్వారా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘మహర్షి’ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా నటించింది. అలాంటి దివి హాట్ షూట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఎప్పుడూ అవే ఫోటో షూట్స్ అంటే అందరికీ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకే దివి ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
అందులో దివి నైటీ వేసుకుని వాళ్ల అమ్మ చెప్పే డైరెక్క్షన్ లో గారెపప్పు దంచుతూ కనిపించింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వెరైటీగా కామెంట్ చేస్తున్నారు. "ఎంత మోడరన్ అమ్మాయిని ఐనా నైటీ వేయాల్సిందే.. ఇప్పుడు నేచురల్ బ్యూటీలా ఉన్నావ్ దివి...దివి దంచిన పచ్చడి తింటే భువి నుండి దివికే...నీ పొడవైన జుట్టును ఎందుకు కత్తిరించేసావ్..బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారా...నేనే డైరెక్టర్ ని అయ్యి నీతో ఒక సినిమా తీసేస్తా...బయటేమో అలాంటి పనులు ఇంట్లో ఇలాంటి పనులు...దీనికి కూడా రీల్ చేయాలా...మంచి మనసున్న అమ్మాయి...మా అతిలోక సుందరి ఏదో నూరుతుంది చేతులు కందిపోతున్నాయి సుందరి...దంచవే మేనత్త కూతురా..గారెలు నువ్వే వెయ్యి.. " అంటూ ఇలా రకరకాల కామెంట్స్ ని పోస్ట్ చేశారు. బిగ్ బాస్ 4 నుంచి బయటికొచ్చాక వరుస ఆఫర్స్ తో బిజీ ఆర్టిస్ట్ అయ్యింది దివి. వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు వరుస సినిమాలు చేస్తోంది. జిన్నా మూవీలో దివి మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది దివి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో కీలక పాత్రలో మెరిసింది.