English | Telugu
అన్నీ మూసుకుని ఉండండి..తినడానికి లేని సిగ్గు వండడానికి ఎందుకు ?
Updated : Feb 8, 2024
ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రపోజ్ డే అని, చాక్లేట్ డే అని, రోజ్ డే అని ఈ వారం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐతే వాలెంటైన్స్ డేని సమర్ధించేవాళ్ళు కొంతమంది ఉంటే దానికి తిరస్కరించేవాళ్ళు మాత్రం చాలామందే ఉన్నారు. ఇక ఇలా వాలెంటైన్స్ అంటూ రెచ్చిపోయే కొందరిని నటి మాధవి లతా ఘాటుగా తిడుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది.
"ఛి దీనెమ్మ.. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు..వాలెంటైన్స్ డే వస్తోంది ప్లాన్స్ ఏంటి రా అని ఒక ఏఐ వాయిస్ అడిగితే నువ్వు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని ఇద్దరం ఒకరికొకరం తోడు..మీ బొంద..మీ బొంద..అబ్బాయిలకైతే డబ్బులు బొక్క.. అమ్మాయిలకైతే అన్నీ బొక్క..మూసుకుని మడతేసుకుని ఇంట్లో కూర్చోండి... అర్దమైతాందా.. వాలెంటైన్స్ డే వస్తే సింగల్ స్టేటస్ మావా సింగల్ స్టేటస్..ఏ ఉండలేరా" అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇక నెటిజన్స్ కొందరు ఆమెకు రిప్లైస్ ఇచ్చారు "బాగా చెప్పారు మేడం ట్రూ లవ్ ఎక్కడుంది అంతా డబ్బే...చాలా బాగా చెప్పారు...మీ డ్రెస్ బాగుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పెళ్ళైన మగవాళ్ళను కూడా ఘాటుగా తిట్టిపారేసింది. "తినడానికి లేని సిగ్గు వండడానికి ఎందుకు...సమానంగా నువ్వు కూడా గాలి పీల్చుకుంటున్నప్పుడు సమానంగా పని చేయాలి..పెళ్లాలంటే ఇంట్లో పని మనుషులా..మీ అమ్మ పని చేసేటప్పుడు మీరు బాధపడ్డారు కదా...ఇంట్లో మీరు కూడా తిరుగుతారు కదా క్లీన్ గా ఉంచుకునే బాధ్యత మీకు లేదా. సిగ్గుపడేంత పని ఏం చేస్తున్నావేంటి...షేర్ చేసుకుంటే సిగ్గు పడడానికి.. బానిసత్వం వద్దని స్వాతంత్రం తెచ్చుకుని ఇప్పుడు ఆడోళ్లకు బానిసత్వం ఎందుకు ఇస్తున్నార్రా మీరు " అని కడిగిపారేసింది.