English | Telugu

వాలంటైన్ కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నటి! 

ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వాలెంటైన్స్ వీక్ నడుస్తోంది. ఇక రేపు లవర్స్ డే కావడంతో సెలెబ్రిటీలు సైతం వారి వారి ప్లాన్ లలో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ మాత్రం నా వాలంటైన్ కోసం వెయిట్ చేస్తున్న అంటు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.

అశ్వినిశ్రీ తెలుగమ్మాయి. 1989 జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌. అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ప్యాన్ బేస్ గట్టిగానే ఉంది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అడుగుపెట్టి క్రేజ్ ని తెచ్చుకుంది. ‌హౌస్ లో భోలే షావలితో ఎక్కువగా ఉన్న అశ్వినిశ్రీ.. నామినేషన్లో మాట్లాడిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మరింత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో శ్రీముఖి లాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఓ ఫోటోని షేర్ చేసింది. "ట్విన్నింగ్ విత్ మై ఫేవరెట్ స్వీట్ హార్ట్ శ్రీముఖి.. తనంటే నాకు ప్రేమ. షీ ఈజ్ సచ్ ఏ స్వీట్ గర్ల్ " అంటు ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది అశ్వినిశ్రీ. కొన్ని రోజుల క్రొతం బ్లాక్ డ్రెస్ లో మల్లెపూలతో శ్రీముఖి పోస్ట్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫోటోలతో కాంబినేషన్ లాగా తన ఫోటోలని మ్యాచ్ చేసి అప్లోడ్ చేసింది అశ్వినిశ్రీ. ఆ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మరోపోస్ట్ లో నా వాలంటైన్ కోసం వెయిటింగ్ అని షేర్ చేయగా దానికి కూడా క్రేజీ కామెంట్లు వస్తున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.