English | Telugu

12 రోజులు బ్రేకింగ్ న్యూస్ లో వేశారు...  ఆ పని  నేను చేయలేదు!

ఢీ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ థీమ్ తో ఈ షో నిర్వహించారు. ఈ షోలో యాంకర్ నందు ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టేసుకుని ఏడ్చేశాడు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ కి యాంకర్ ప్రదీప్ తప్పుకోవడంతో ఆయన ప్లేస్ లో నందు ఎంట్రీ ఇచ్చారు. ఐతే నందు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో హోస్టింగ్ ఢీ షోకి వచ్చాడు. అలా వచ్చిన దగ్గర నుంచి షో చాలా స్మూత్ గా వెళ్ళిపోతోంది. ఈ వారం ప్రోమోలో నందుని హైపర్ ఆది ఓ ప్రశ్న అడిగాడు. "మీ మధ్య జరిగిన ఏదైనా ఎమోషనల్ మూమెంట్" అని అడగగానే నందు ఎమోషనల్ అయ్యాడు. "నా మీద ఒక రూమర్ వచ్చింది.

నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్‌లో బాగా వేశారు. నేనేం చేయపోయినా చేసాను అంటూ అదే న్యూస్ ని 12 రోజులు వేశారు. ఐతే ఆ పని నేను చేయలేదు అని తెలిసిన తరువాత.. ఒక చిన్న స్క్రోలింగ్‌లో వీడు చేయలేదని వేశారు" అంటూ నందు కంటతడి పెట్టుకున్నాడు. దానికి శేఖర్ మాస్టర్, ప్రణీత కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆది స్టేజి మీదకు వచ్చి "ప్రదీపన్న సెంటర్ లో లేడు, యాంకరింగ్ కి లేడు అనగానే అందరం ప్రదీప్ అన్నను మిస్ అయ్యాము అని అనుకున్నాం మాష్టర్... కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు ఆ ఫీలింగ్ తీసుకురాలేదు మాష్టర్ ఇతను" అంటూ నందు గురించి చెప్పాడు.టాలీవుడ్‌ కి డ్ర‌గ్స్ మాఫియాకు ఉన్న సంబంధాల‌పై కొన్ని రోజుల క్రితం కలకలం రేగింది.ఐతే రీసెంట్ గా టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా అంటూ నందుతో పాటు డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ను ఈడీ విచారించింది. కానీ సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఈ డ్రగ్స్ కేసులను కోర్టు కొట్టేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.