English | Telugu
నా దగ్గర సానా తాళాలున్నాయ్...
Updated : Feb 14, 2024
ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బులెట్ భాస్కర్ - సత్య స్కిట్ హైలైట్ గా నిలిచింది. వర్షం మూవీ సీన్ ని స్పూఫ్ గా చేశారు. సత్య వానలో తడుస్తూ వస్తుండగా భాస్కర్ అడ్డు వచ్చాడు...అది గమనించని సత్య వెళ్లి అతని మీద పడుతుంది. "చూసుకోవద్దా" అని సత్య రివర్స్ లో అడిగేసరికి "చూసే నీకు అడ్డొచ్చా" అన్నాడు భాస్కర్.
"నేను అంటోంది సరిగా చూడలేదా అని" సత్య మళ్ళీ అడిగేసరికి "మొత్తం రాత్రి యూట్యూబ్ లో చూసా" అంటూ నితిన్ నటించిన ఎక్స్ట్రా మూవీలో సత్య పోలీసు డ్రెస్ లో "నా పెట్టె తాళం" అనే డబుల్ మీనింగ్ సాంగ్ కి మ్యూజిక్ వేసేసరికి సత్య సీరియస్ అయ్యింది. "ఇదిగో అమ్మాయి మన దగ్గర సానా తాళాలున్నాయ్" అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు భాస్కర్. తర్వాత రాకేష్-సుజాత స్కిట్ లో కూడా మస్త్ కామెడీ పంచులు ఉన్నాయి..సుజాత రాకేష్ చేసే బిజినెస్ ల మీద ఫైర్ అయ్యింది. "నాటుకోళ్ల బిజినెస్ పెట్టావ్ ఏమయ్యింది ...కుక్కలు తిన్నాయి...చేపల బిజినెస్ అన్నావ్ ..పిల్లులు తినేసాయి. ఆఖరికి కుక్క బిస్కెట్ల బిజినెస్ కూడా చేసాడు..ఆ కుక్క బిస్కెట్లు ఎం చేసావ్ " అని సుజాత ఇంద్రజాకు చెప్తుండగా "కుక్క బిస్కెట్లు మీ అమ్మ తిన్నది" అని రాకేష్ ఫన్నీ కౌంటర్ వేసాడు. ఫైనల్ గా ఆటో రాంప్రసాద్-రోహిణి- దొరబాబు కలిసి స్కిట్ చేశారు. రామ్ ప్రసాద్ తన ఇంట్లో గెస్ట్ గా దొరబాబును పెట్టి ప్రతీ పనికి రోహిణిని దొరబాబును పంపించేసరికి చివరకి వాళ్లిద్దరూ జోడిగా మారడం రామ్ ప్రసాద్ షాకవ్వడం ఈ స్కిట్ లో హైలైట్ సీన్. అలాగే వర్ష- ఇమ్మానుయేల్ కలిసి గోస్ట్ స్కిట్ ఒకటి చేశారు. అందులో వర్ష చేతిని మరో కమెడియన్ ముద్దు పెట్టుకొనేసరికి ఇమ్మానుయేల్ వచ్చి కొట్టడం కొంచెం ఫన్నీగా ఉంది. ఇలా ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఎంటర్టైన్ చేయబోతోంది.