English | Telugu
బెండకాయ్.. దొండకాయ్.. రవి నా గుండెకాయ్ : ఆర్జే కాజల్!
Updated : Feb 13, 2024
సెలబ్రిటీలు మాట్లాడే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరికొంతమంది నెటిజన్లతో మాట్లాడే విధానం, వారితో కన్వర్ సేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వాలైంటైన్ డే హావా నడుస్తోంది. ఆర్జే కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఆర్జే కాజల్ తనకి సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లతో, యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ తో షేర్ చేస్తుంటుంది.
ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి.
ఆస్క్ మి క్వశ్చనింగ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఇన్‌స్టా లో షేర్ చేసింది కాజల్. ఒక సెలబ్రిటీగా మీకు వచ్చే నెగెటివిటిని మీరు ఎలా ఓవర్ కమ్ చేస్తారని ఒక నెటిజన్ అడుగగా.. ఫస్ట్ నన్ను సెలెబ్రిటీ అనొద్దు. నెగెటివ్ కామెంట్ల గురించి నేను పట్టించుకోను. గుడ్ ఆర్ బ్యాడ్, కొంతమంది నన్ను ఇష్టపడతారు. మరికొంతమంది అయిష్టపడతారు. నన్నెవరు ఇగ్నోర్ చేయరనే సాటిస్ ఫాక్షన్ తో హ్యాపీగా ఫీల్ అవుతా అని రిప్లై ఇచ్చింది. ఎందుకు నిన్ను సెలబ్రిటీ అనొద్దు? నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీ వెల్ విషర్స్ ని కూడా తక్కువ చేస్తున్నావని ఒకరు అడుగగా.. ఎందుకంటే నన్ను నేను రాక్ స్టార్ అని అనుకుంటే అందుకే నన్ను రాక్ స్టార్ అని పిలవండి అని కాజల్ అంది.
అనీ మాస్టర్ తో మీ బాండింగ్ ఎలా ఉందని ఒకరు అడుగగా.. నిన్నే కలిసాం. తను చాలా స్వీట్ హార్టెడ్. తనెప్పుడు ఇతరులకు హెల్ప్ చేయడానికే చూస్తుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగినవి తలచుకొని మేమిద్దరం నవ్వుకుంటాం. మా స్నేహానికి విలువిస్తామంటూ కాజల్ అంది. యాంకర్ రవి గురించి చెప్పండి అని ఒకరు అడుగగా.. గుండెకాయ్.. బెండకాయ్.. రవి నా గుండెకాయ్.. ఇంతకన్నా ఏం చెప్పను రవి గురించి అని కాజల్ రిప్లై ఇచ్చింది. లేటెస్ట్ పిక్ విత్ పింకీ అని ఒకరు అడుగగా.. తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేసింది కాజల్. కాగా ఇప్పుడు నెటిజన్లతో పంచుకున్న ఈ క్వశ్చనింగ్ హాట్ టాపిక్ గా మారింది.