లవ్ స్టోరీ చెప్పిన యాని మాస్టర్..డాన్స్ చేస్తూ పడిపోయిన సుమ
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డాన్సర్స్ అమ్మ రాజశేఖర్, భాను మాస్టర్, యాని మాస్టర్, రఘు మాస్టర్ స్టేజి మెడకు ఎంట్రీ ఇచ్చారు. "యాని మాస్టర్ మీది లవ్ మ్యారేజ్ కదా మీ లవ్ స్టోరీ చెప్పండి" అని సుమ అడిగేసరికి "ఆయన చూసారు, నేను చూసాను ఐపోయింది" అని కామెడీ ఫేస్ తో చెప్పేసరికి "చూసారు, చూసారు, చేశారు" అంటూ అమ్మ రాజశేఖర్ ఇంకా కామెడీగా చెప్పాడు. "ఎక్కడ కలిశారు మీరిద్దరూ" అని మళ్ళీ సుమ అడిగింది "ఏదో ఫంక్షన్ లో చూసుకున్నాం" అని చెప్పింది యాని మాస్టర్.