English | Telugu

కుమారి ఆంటీ ఇజ్జత్ తీసేసిన కీర్తి భట్...ఫుడ్ అస్సలు బాలేదు!

సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది. బీబీ ఉత్సవంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో బిగ్ బాస్ హౌస్ కి కూడా వెళ్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటి కుమారి ఆంటీ దగ్గరకు అంత మంది వెళ్లి ఫుడ్ తింటున్నారంటే ఎంతో బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. అలాగే బుల్లి తెర నటి కీర్తి భట్ ఆమె వుడ్ బి విజయ్ కార్తీక్ ఇద్దరూ ఆమె నిర్వహించే ఫుడ్ అడ్డాకు వెళ్లారు. ఇక అక్కడ నాన్ వెజ్ ఒక్క ముద్ద తినేసరికి బాబోయ్ అని కీర్తి కళ్ళు మూసుకుందట..అంత భయంకరమైన కారంగా ఉందని తినలేకపోయిందని చెప్పాడు కార్తీక్. తానే వండితే కుమారి ఆంటీ కన్నా చాలా బాగా చేస్తానని చెప్పింది కీర్తి. మొదట్లో బాగానే ఉండేదేమో కానీ రద్దీ పెరిగేసరికి ఎలా చేస్తే ఏముందిలే అన్నట్టుగా ఉంది ఫుడ్ అన్నారు.

గుప్పెడు వైట్ రైస్ కి నాలుగు ముక్కలకు 170 రూపాయలు ఇచ్చాము. అంత అమౌంట్ ఆ ఫుడ్ అసలు వర్త్ కాదు అని చెప్పారిద్దరూ. అస్సలు అక్కడ ఫుడ్ బాలేదు. అందరూ అంటుంటే తిందామని వచ్చాము అలాగే కుమారి ఆంటీని కూడా చూద్దామని వచ్చాము.. . ఇది మా ఒపీనియన్ మాత్రమే...మళ్ళీ మా మీద ట్రోల్స్ అవీ చేయకండి. త్వరలో ఆమె పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలని..బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని మా సైడ్ నుంచి విష్ చేస్తున్నాం అని అన్నారు. కుమారి ఆంటీ గురించి అక్కడ ఉన్నవాళ్లను అడిగితే ఆమె ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారని ఉదయం వచ్చి ఒకసారి కనిపించి వెళ్ళిపోతారని చెప్పారు..ఈసారి ఖాళీ టైం చూసుకుని రష్ లేని టైంలో వచ్చి ఫుడ్ తిని ఆమె కలవడానికి ట్రై చేస్తాం అని చెప్పారు ఈ జంట. ఇలా వీళ్ళు ఫుడ్ వ్లాగ్ ని చేసి వాళ్ళ యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..