English | Telugu

టాప్ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో "ఆదివారం పరివారం షో" సెకండ్ ప్లేస్ లో "సూపర్ సింగర్ "


బుల్లితెర మీద స్టార్ మాలో ప్రసారమయ్యే షోస్ కి ఒక రేంజ్ లో రేటింగ్ వస్తూ ఉంటుంది. ఐతే రేటింగ్ రావడం అంటే ఏమంత సామాన్య విషయం కాదు. మంచి వ్యూస్ రావాలి అంటే కలర్ ఫుల్ సెట్ ఉండాలి. మంచి కాన్సెప్ట్ ని ఎంచుకోవాలి..ఆ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే మంచి టీమ్ ఉండాలి...టీంలో మంచి ఎనర్జీతో పాటు టైమింగ్ , స్పాంటేనిటీ ఉండాలి...అలాగే టైమింగ్ కి తగ్గట్టు పంచ్‌లు పడాలి..ట్రెండ్ కి తగ్గట్టు బిహేవియర్ ఉండాలి...ఇవన్నీ ఒకెత్తు ఐతే కేకపుట్టించే కంటెంట్ తో కలర్ ఫుల్ యాంకర్ తో ఈ షో నిర్వహించాలి.. ఇన్ని మెయింటైన్ చేసి ఒక షోని బయటకు వదిలితే అది అద్భుతంగా హిట్ కొట్టాల్సిందే. మరి అలాంటి షోస్ లో ఈ వారం టాప్ లో ఉన్నవి "ఆదివారం విత్ స్టార్ మా పరివారం".

ఈ షో 5 .5 రేటింగ్ తో ఉండగా, మరో వైపు రీసెంట్ గా రిలీజయిన "సూపర్ సింగర్" షో 5 . 2 రేటింగ్ తో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. ఈ రెండు షోస్ కి హోస్ట్ శ్రీముఖి. శ్రీముఖి హోస్టింగ్ గురించి పంచ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో టీవీ షోస్ లో వచ్చే యాక్టర్స్ తో కామెడీ చేయించడం, టాస్కులు ఆడించడం చేయిస్తూ ఉంటుంది శ్రీముఖి. అలాగే శ్రీముఖికి పాలేర్లుగా ఎక్స్ప్రెస్ హరి, ముక్కు అవినాష్ కూడా మంచి కామెడీ చేస్తూ అప్పుడప్పుడు షోలో స్కిట్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే సూపర్ సింగర్ షో మంచి సింగింగ్ షో. ఇక ఇందులో జడ్జెస్ గా మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, శ్వేతా ఇలా మంచి ఫేమస్ సింగర్స్ ఉన్నారు.. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల ఐతే చాలు ఆడియన్స్ ఈ షో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్ స్టాప్ వినోదంతో ఆదివారాన్ని కలర్ ఫుల్ గా చేసేస్తుంది షో. ఇలా ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న షోస్ పిక్ ని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పెట్టుకుని శ్రీముఖి, అవినాష్, హరి డాన్స్ చేశారు.