English | Telugu
రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేసాడు..యావర్-గౌతమ్ తో మల్టీస్టారర్ మూవీ...హీరోయిన్ శుభశ్రీ!
Updated : Feb 15, 2024
బిగ్ బాస్ హౌస్ లో శుభశ్రీ రాయగురు-గౌతమ్ కృష్ణ జంటకు ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి షోస్ లో, ఈవెంట్స్ లో కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజున శుభశ్రీ గౌతమ్ తో కేక్ కట్ చేయించింది. గౌతమ్ ఆమెకు రింగ్ పెట్టి ప్రొపోజ్ చేసాడు..ఇంతకు అసలు విషయం ఏమిటో చూద్దాం. గౌతమ్ నటించిన "సోలో బాయ్" మూవీ ప్రమోషన్స్ ని శుభశ్రీ వెరైటీగా కండక్ట్ చేసింది. ఒక సెపరేట్ రూమ్ ని ఏర్పాటు చేసింది..కళ్ళకు గంతలు కట్టి లోపలికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 లోని లేడీ కంటెస్టెంట్స్ కళ్ళను మాత్రమే చూపించి ఆ కళ్ళు ఎవరివో గుర్తు పట్టాలంటూ టాస్క్ ఇచ్చింది..ఆ తర్వాత ఎలాంటి అమ్మాయి కావాలో అడిగింది.. ఎడ్యుకేషన్ పక్కన పెడితే మంచి కేరింగ్ గా చూసుకునే అమ్మాయి కావాలి అని చెప్పాడు.
అలాగే "ఆకాశవీధుల్లో" మూవీ నుంచి ఒక సాంగ్ కూడా పాడాడు తన ఫాన్స్ కోసం. ఇక ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు గౌతమ్ ఆన్సర్ ఇచ్చాడు.."గౌతమ్ కృష్ణ- యావర్ కలిసి మల్టి స్టారర్ మూవీ చేయాలి అందులో శుభశ్రీని హీరోయిన్ గా పెట్టాలి. జస్ట్ లైక్ ప్రేమదేశం, ఆర్య" అని అనేసరికి "ఈ కామెంట్ పంపించిన పర్సన్ స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తే మంచిగా ఉంటే మేము కచ్చితంగా చేస్తాం" అని చెప్పాడు. "ఎవరైనా డైరెక్టర్ కి ఇలాంటి థాట్ ఉంటే గనక మమ్మల్ని కలవండి. మేము మూవీ చేయడానికి రెడీగా ఉన్నాం" అని చెప్పారిద్దరూ. తర్వాత శుభశ్రీ యూట్యూబ్ ఛానల్ కి 200 కే సబ్స్క్రైబర్స్ ఐనందుకు రెడ్ రోజ్ ఇచ్చి విషెస్ చెప్పాడు. గౌతమ్ పాస్ట్ లో తన లవర్ కి ఎలా ప్రపోజ్ చేసాడో అలా ఆ అమ్మాయిని ఇప్పుడు తనలో చూసుకుని లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని కోరింది శుభశ్రీ. ఆమె మాటను కాదనలేక ఐ లవ్ యు అని చెప్పి రింగ్ పెట్టి జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పాడు. ఫైనల్ గా కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈ వీడియోని శుభశ్రీ తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.