English | Telugu

24 గంటలూ అలా మొబైల్ ని వాటేసుకోకండి...

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే జీవితం గడవడం లేదు..రోజు అస్సలు పూర్తి కావడమే లేదు..? కరోనా టైం నుంచి ఈ మొబైల్ మేనియా పిల్లలకు కూడా పాకింది. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురూ నాలుగు మొబైల్స్ తో రోజు గడిపేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు తిండి తినడం లేదని బాధపడేవారు ఇప్పుడు మొబైల్ వదలడం లేదని కౌన్సిలింగ్ సెంటర్స్ కి తీసుకెళ్తున్నారు. అలాంటి మొబైల్ కి సంబంధించి బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అందరినీ ఒక ప్రశ్న అడిగింది. మొబైల్ ఫోన్ మన దగ్గర ఎంత సేపు ఉండొచ్చని ఎవరో ఆమెను అడిగారట. ఆ ప్రశ్న ఇప్పుడు అందరినీ అడిగింది. అలాగే ఆన్సర్ కూడా చెప్పింది. "అమ్మ దగ్గర మనం ఎంతసేపు కూర్చోగలుగుతామో అంత సేపు మొబైల్ ఫోన్ మన దగ్గర మొబైల్ ఉండొచ్చు అని చెప్పింది. అదేం లాజిక్ అనుకుంటున్నారు కదా..

ఇక్కడే అసలైన లాజిక్ చెప్పింది జ్యోతి. పడుకునే టప్పుడు, కుర్చునేటప్పుడు, తినేటప్పుడు ఎక్కడికి వెళ్లినా మొబైల్ ని వాటేసుకుని మరీ అన్ని పనులు చేస్తున్నారు కదా అంటే 24 గంటలు మీ అమ్మ దగ్గర కూడా అన్ని గంటలు ఉంటారా ? అని ప్రశ్నించింది..మీ అమ్మ దగ్గర అన్ని గంటలు ఉండరు కదా...మొబైల్ తో గడిపినట్టు ఒక మొత్తం రోజును మీ అమ్మతో గడపండి చూస్తా..ఎవరి లైఫ్ వారిది అని అంటారేమో మీరు..అది ఓకే కానీ అమ్మకి ఎంత టైం ఇస్తారో మొబైల్ ఫోన్ కి అంత టైం ఇస్తే చాలు. అమ్మ చనిపోయాక ఫోటో పెట్టుకుని ఏడవడం కంటే బతికున్నప్పుడు మీ మొబైల్ కి ఎంత టైం ఇస్తారో అంత టైం ఇవ్వండి ..బతికుండగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి.. మొబైల్ ఫోన్ తో ఎందుకు టైం స్పెండ్ చేయడం అంటూ మొబైల్ యూజర్స్ కి గట్టిగా ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ని మంచిమాట రూపంలో ఇచ్చింది. ఈమె చేసిన ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ కూడా ఆమె మాటలకు ఫిదా ఐపోయి సూపర్ వర్డ్స్, ఫాలో కావాలి, అమ్మ పాతకాలపు చాదస్తపు మనిషి... కానీ మొబైల్ అప్ డేటెడ్ వెర్షన్ కదా.. అమ్మ కంటే... మొబైల్ మాత్రమే ముఖ్యం... ఏం చేయలేము..సూపర్" అని పొగిడేస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..