English | Telugu

రిక్కీ ఫెయిల్ అవడంతో బాధపడుతున్న డాక్టర్ బాబు...

మంజుల-నిరుపమ్ బుల్లితెర మీద చక్కని నటీనటులు..ఐతే ఇప్పుడు నిరుపమ్ డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్ లో నటించి అలరించాడు. ఇప్పుడు కార్తీకదీపం సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అబ్బాయి రిక్కీతో ఒక ప్రాంక్ వీడియోని ప్లాన్ చేశారు. రిక్కీ ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. మెయిన్ ఎగ్జామ్స్ ఐపోయేసరికి తనకు మార్క్స్ సరిగా రాలేదు అని సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాడని మళ్ళీ అదే క్లాస్ లో ఉండాలి అంటూ వాళ్ళ మొబైల్ కి స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టుగా ప్లాన్ చేశారు. చివరికి రిక్కీకి వీడియో చేస్తున్నట్టు తెలీకుండా కెమెరాని హైడ్ చేసి మరీ వీడియో చేశారు. ఆ ఫెయిల్  మెసేజ్ ని రిక్కీకి చూపించేసరికి అస్సలు నమ్మలేదు. ఐనా ఆదివారం రోజున స్కూల్ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేస్తారు అని అడిగాడు.

పూల్ లో కిస్ సీన్ పవన్ కళ్యాణ్ సర్ తో ఐతే ఒకే కానీ ...అర్జున్ కళ్యాణ్ వద్దు!

బాబు..బుల్ షిట్ గై మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అర్జున్ కళ్యాణ్, హీరోయిన్ కుషిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇందులో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు వీళ్ళు ఆన్సర్స్ ఓ రేంజ్ లో ఇచ్చారు. "ఒక వేళ నేను ఎవరైనా హీరోయిన్ తో స్ట్రక్ అవ్వాల్సి వస్తే శృతి హాసన్ తో స్ట్రక్ అవుతా" అని అర్జున్ చెప్పేసరికి "మరి శ్రీ సత్యకి ప్రొపోజ్ చేసింది ఫేకా అని హోస్ట్ అడిగేసరికి "ఎందుకు చేసాను ప్రపోజ్ చేయనేలేదు ఎప్పుడూ" అని చెప్పాడు.  "నేను పవన్ కళ్యాణ్ తో స్ట్రక్ అవుతా..ఆయన్ని అలా చూస్తూ కూర్చుంటే చాలు.. ఇంకేం చేయను" అని చెప్పింది కుషిత. ఇక ఈ సినిమా గురించి చెప్తూ పూల్ లోపల కిస్ సీన్ పెడతామన్నారు కానీ వద్దు అన్నట్లు కుషిత చెప్పడంతో ఆ సీన్ ని ఆపేశారట. "ఐనా పూల్ లో కిస్ సీన్ పవన్ కళ్యాణ్ సర్ ఐతే ఒకే కానీ అర్జున్ కళ్యాణ్ వద్దు" అంది కుషిత. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చింది హోస్ట్ .

Krishna Mukunda Murari:కృష్ణ కొత్త ప్లాన్.. రెండు జంటలకి శోభనం అనగానే షాకైన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -407  లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ముకుందకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే కృష్ణకి ఒక ఐడియా వస్తుంది‌. దాన్ని మురారికి చెప్తుంది. బాగుందని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద ఉప్మా పెసరట్టు చేసి తీసుకొని వస్తుందని డైనింగ్ టేబుల్ దగ్గరే  ఆదర్శ్ వెయిట్ చేస్తుంటే.. అప్పుడే మధు వచ్చి ఇంకా రాలేదా నీకు ఉప్మా పెసరట్టు అని అంటాడు. అది కొంచెం లేట్ ప్రాసెస్ కదా అని ఆదర్శ్ అంటాడు.

‘మొగలిరేకులు’ ఫేమ్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత.. అసలేం జరిగింది?

అప్పట్లో జెమిని టీవీలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సీరియల్ కి వచ్చినంత క్రేజ్ ఇంకే సీరియల్ కి కూడా రాలేదు.  ముఖ్యంగా ఈ సీరియల్ కి లేడీ ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ సీరియల్ లో ఇంద్రకి ఇద్దరు బ్రదర్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒక బ్రదర్ పేరు దయ.. అతని అసలు పేరు పవిత్రనాథ్ .  ఇందులో నటించిన పవిత్రనాథ్ కు ఎంతో గుర్తింపు లభించింది. మొగలిరేకులు సీరియల్ లో తన పాత్ర మంచి హిట్ అవ్వడంతో పవిత్రనాథ్ ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే, కొన్నేళ్ల క్రితం ప్రవిత్రనాథ్ భార్య శశిరేఖ మీద సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త పవిత్రనాథ్ అమ్మాయిల పిచ్చోడు అని చెప్పింది.

అమ్మాయిల కోసం నువ్వు మారొద్దు..జనసేన కోసం నిలబడతా!

మెగా ఫామిలీలో కొత్త పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ ఒక పోడ్కాస్ట్ లో ఎన్నో విషయాలు చెప్పాడు. "రీసెంట్ గా పెళ్లయ్యాక లావణ్యతో కలిసి ఫిన్ ల్యాండ్ హనీ మూన్ ట్రిప్ వెళ్లాను. నేను ఎక్కుగా టైం స్పెండ్ చేస్తాను లావణ్య మాత్రం చాలా తక్కువగా టైం స్పెండ్ చేస్తుంది. ఖర్చు కూడా నేనే ఎక్కువ పెడుతూ ఉంటా. ఎక్కువగా రకరకాల షూస్ కొనడం నాకు ఇష్టం. కోపం తెచ్చుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. ఒకసారి నేను చాలా కాస్ట్లీ ఫోన్ విసిరేసా. తర్వాత మళ్ళీ అది పగిలిపోయిందేమో అనుకుని చూసుకున్నా...అంత కాస్ట్లీ ఫోన్ మళ్ళీ ఇంట్లో వాళ్ళు కొనివ్వలేరు కదా అనుకున్నా. తర్వాత కోపం తగ్గించుకున్నా. ఒకవేళ కోపం వస్తే దిండును విసిరికొడతా తప్పా ఇంకేం చేయను.

పుచ్చకాయల పొలంలో సింగర్...వాటికీ పాటలు నేర్పిస్తోందా ?

సింగర్ సునీత ఏది చేసిన అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది. పాట పాడినా అంతే అందంగా ఉంటుంది. మాట్లాడినా అంతే జోష్ గా ఉంటుంది. ఇక సునీతకు ప్రకృతి అన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. అలాంటి సునీత రీసెంట్ గా తన పొలంలో తిరుగుతూ సందడి చేస్తూ కనిపించింది. ఎప్పుడూ పాటలు పాడుతూ కనిపించే సునీత  మొదటి సారి పుచ్చకాయ పంటపొలంలో తిరిగింది. పుచ్చకాయలు కూడా పాటలు నేర్పిస్తోందా సునీత అన్నట్టుగా ఉంది ఆ పిక్ ని చూస్తే.   అన్ని రకాల పుచ్చకాయల్ని చూస్తూ కొంచెం పెద్ద సైజులో ఉన్న పండిన పుచ్చకాయల్ని తెంపింది. ఒక పుచ్చకాయని అక్కడే పంటపొలాల్లో కోసుకుని తిన్నది.

సూపర్ సింగర్స్ షోలో మదర్ సెంటిమెంట్..

ఈ వారం సూపర్ సింగర్స్ షో దుమ్ము రేపబోతోంది..ఈ  నేపథ్యంలో వచ్చే వారం ప్రసారం కాబోయే సూపర్ సింగర్ ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది..  మంచి కలర్ ఫుల్ గా  ఉంది. ఇక ఈ ప్రోమోలో హోస్ట్  శ్రీముఖి చేసిన హంగామా మాములుగా లేదు .."అందరూ జోడీలుగా వచ్చారు నేనే సింగల్ గా వచ్చాను" అని చెప్తూ చాలా ఫీలయ్యింది. ఇక శ్రీముఖికి నేనున్నానంటూ మ్యూజిక్ ట్రూప్ లో ఉన్న లీడ్ మ్యుజీషియన్ వచ్చి "నీకు నే జోడి" అని వచ్చి శ్రీముఖి పక్కన నిలబడి కాసేపు డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసారు.. ఆ తరువాత కంటెస్టెంట్స్  వచ్చి మంచిమంచి  హిట్ సాంగ్స్ పాడి వినిపించారు.. ఈవారం డ్యూయెట్ రౌండ్ ఇచ్చింది శ్రీముఖి. కాబట్టి కంటెస్టెంట్స్ అంత కూడా జోడిగా మంచి హిట్ సాంగ్స్ ని ఆలపించి  జడ్జెస్ ని మెప్పించారు. ఆ తరువాత శ్రీముఖి మధ్యలో ఒక టాస్క్ ఇచ్చింది.