English | Telugu
ఉప్మా స్పెల్లింగ్ కూడా రాని బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా!
Updated : Mar 2, 2024
తెలుగు టీవీ షోలలో బిగ్ బాస్ కి ఉండే క్రేజే వేరు. అందులోను సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ మరీ ఫేమస్ అయ్యారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఇప్పటికి ఏడు సీజన్ లు పూర్తి చేసుకుంది. కానీ అయిదు, ఏడు సీజన్లు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
సీజన్ సెవెన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజీ యావర్ , అటు సీరియల్ బ్యాచ్.. టేస్టీ తేజ, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, నయని పావని, అశ్వినిశ్రీ, భోలే షావలి, ఇలా చెప్పుకుంటు పోతే అందరు ఫేమస్ అయ్యినవారే. వీరందరి ఆటతీరు, మాటతీరుతో ఈ సీజన్ సెవెన్ ని హిట్ చేశారు. అయితే బిగ్ బాస్ తర్వాత చాలాసార్లు హౌస్ మేట్స్ అంతా కలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మొదలైన బిబి మహోత్సవంలో కూడా వీళ్ళ సందడి మాములుగా లేదు. టీఆర్పీకి తగ్గట్టుగా ఈ షో మేకర్స్ కంటెస్టెంట్స్ చేత ఎమోషనల్ డైలాగ్స్ చెప్పిస్తున్నారు. అయితే శూభశ్రీ, టేస్టీ తేజ, అమర్ దీప్ , అరియానా గ్లోరీ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. దాంతో అక్కడ వాళ్ళు గడిపిన క్షణాలని వ్లాగ్స్ గా తీస్తూ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నారు.
టేస్టీ తేజ, అమర్ దీప్, శుభశ్రీ కలిసి భోజనం చేస్తుండగా ఓ వీడియోని పోస్ట్ చేశాడు తేజ. అందులో ఫస్ట్ టైమ్ చూస్తున్నానయ్య ఉప్మా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మరీ తినడమని శుభశ్రీని ఉద్దేశించి టేస్టీ తేజ అన్నాడు. అయితే ఆ వీడియోకి ' UPAM Order pettadam enti ' అని తేజ రాసాడు. అది చూసిన శుభశ్రీ ఆ వీడియోని కాపీ చేసి.. ఉప్మా స్పెల్లింగ్ అయిన సరిగ్గా రాస్కోరా అని పోస్ట్ చేసింది. అంటే టేస్టీ తేజకి ఉప్మా స్పెల్లింగ్ కూడా రాదా.. ఇది చూసినవెంటనే.. ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా నాకు అని టేస్టీ తేజ డైలాగ్ గుర్తొచ్చింది. మరి ఉప్మా స్పెల్లింగ్ కూడా రాని టేస్టీ తేజ బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాడు. మరి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి.