English | Telugu

Krishna Mukunda Murari:కృష్ణ కొత్త ప్లాన్.. రెండు జంటలకి శోభనం అనగానే షాకైన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -407 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ముకుందకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే కృష్ణకి ఒక ఐడియా వస్తుంది‌. దాన్ని మురారికి చెప్తుంది. బాగుందని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద ఉప్మా పెసరట్టు చేసి తీసుకొని వస్తుందని డైనింగ్ టేబుల్ దగ్గరే ఆదర్శ్ వెయిట్ చేస్తుంటే.. అప్పుడే మధు వచ్చి ఇంకా రాలేదా నీకు ఉప్మా పెసరట్టు అని అంటాడు. అది కొంచెం లేట్ ప్రాసెస్ కదా అని ఆదర్శ్ అంటాడు.

ఆ తర్వాత ముకుంద దగ్గరకి రేవతి వచ్చి... ఇంకా ఆదర్శ్ టిఫిన్ చెయ్యలేదా అని అడుగుతుంది. అయ్యో మర్చిపోయానే అని అనుకొని పిండి పాడైందంట అని ముకుంద కవర్ చేస్తుంది. నేను చేసి తీసుకొస్తానులే అని ముకుందతో రేవతి అంటుంది. కాసేపటికి కృష్ణ, మురారి ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్లకి కూడ ప్రిపేర్ చేస్తానని ముకుంద అంటుంది. టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళారని ముకుంద అడుగుతుంది. మేమ్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాం.. మాకు శోభనం ఈ రోజు జరిపించొచ్చని చెప్పాడని మురారి అనగానే.. వీళ్ళేదో స్కెచ్ తోనే వచ్చారని ముకుంద అనుకుంటుంది. మీ రెండు జంటలతో పూజ జరిపించాలి. గుడికి రెడీ అవ్వండని రేవతి చెప్తుంది. ఆ తర్వాత నువ్వు సూపర్ కృష్ణ అని మురారి గదిలోకి వచ్చాక కృష్ణని పొగుడుతు ఉంటాడు.

ఆ తర్వాత మన ప్లాన్ అర్థం కాక ముకుంద జుట్టు పీక్కుంటుంది. ఇక్కడ మన శోభనం అవుతుందని మురారి అనగానే.. మనకి శోభనం కాదు యాక్టింగ్ అంతే అనగానే మురారి మళ్ళీ డిస్సపాయింట్ అవుతాడు. ముకుంద శోభనం ఆపాలని చాలా ప్రయత్నం చేస్తుందని ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ముకుంద గుడికి రెడీ అయ్యావా అంటు ఆదర్శ్ వస్తాడు. మనతో పాటు వాళ్ళకి కూడా శోభనం అవడం చాలా హ్యాపీగా ఉందని ఆదర్శ్ అంటాడు. అయిన వాళ్ళ శోభనం జరుగుతుంటే ఎలా చూస్తుంటానని ముకుంద అనుకుంటుంది. మురారి నీతో మాట్లాడాలని మురారికి ముకుంద మెసేజ్ చేస్తుంది. అది కృష్ణ చూస్తుంది.. తరువాయి భాగంలో అందరు గుడికి వెళ్తారు. మురారి అడుగులో ముకుంద నడుస్తుంటే.. కృష్ణ, మధు ఇద్దరు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.