English | Telugu
బేల్ పూరితో ప్రపోజ్ చేసిన వాలైంటైన్ ఎవరో తెలుసా!
Updated : Mar 2, 2024
ఫిబ్రవరి నెలంతా ప్రేమికులకు పండుగే.. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ గా జరుపుకుంటారు కొందరు. అయితే కొంతమంది మాత్రం మార్చి లో కూడా ఆ లవ్ ని అంతే ఫ్రెష్ గా ఉండేలా చేసుకుంటున్నారు. మరి ఆ లవ్ ప్రపోజల్ ఏంటో ఓసారి చూసేద్దాం.
ప్రియాంక జైన్ , శివ్ గత కొన్నేళ్ళుగా సహజీవనం సాగిస్తున్నారు. వారి ప్రేమ పెళ్ళికి నెటిజన్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆడపులిలా చెలరేగి టాప్ లో నిలిచింది ప్రియాంక. హౌస్ లో ఉన్నన్ని రోజులు కిచెన్ కే పరితమైన ఈ బ్యూటీ.. అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి గ్యాంగ్ నడిపించింది. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ముగ్గురు చేసినన్ని ఫౌల్స్ ఎవరూ చేయలేదు. అయితే ఆటతీరు, మాటతీరు పక్కన పెడితే.. గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఈ పొట్టి పిల్లకి గట్టి ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ నుండి బయటకొచ్చాక శివ్ తో కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూనే ఉంది. అయితే వీళ్ళిద్దరు కలసి వెకేషన్ కి వెళ్ళారు. అక్కడ ప్రియాంకకి రెడ్ రోజ్ తో ప్రపోజ్ చేయకుంటా బేల్ పూరితో చేసాడు శివ్. దాంతో హీ ఈజ్ సో నైస్ అంటు పోస్ట్ చేసేంది ఈ పొట్టి పిల్ల. మరి వీళ్ళ లవ్ స్టోరీ కి ఫుల్ స్టాప్ పెట్టి ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని చాలామంది చూస్తున్నారు. మరి శివ్ చేసిన ఈ ప్రపోజల్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. శివ్ కుమార్, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి ' మౌనరాగం' సీరియల్ నుండి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.