English | Telugu

ఈ నెల తనకి సెంటిమెంట్ అంటున్న పూజామూర్తి !

కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని అలావాట్లు, ఫేవరెట్ కర్రీ, ఫేవరెట్ డ్రెస్ లాంటివి ఉంటాయి. అలాగే ఫేవరెట్ మంత్ కూడా ఉంటుంది. అయితే మార్చి అనగానే స్టుడెంట్స్ కి గుర్తొచ్చేవి పరీక్షలు, కాలేజీ వాళ్ళకి సమ్మరవ హాలిడేస్.‌..సెలెబ్రిటీలకు వెకేషన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పూజామూర్తికి మాత్రం మార్చి నెల సెంటిమెంట్ అంట‌. మరి ఎందుకు తనకి ఈ నెల ఎందుకు అంత స్పెషలో ఓసారి చూసేద్దాం.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజామూర్తి ‌హౌస్ లో తన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకుంది. 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, భోలే షావలి, పూజామూర్తి, అశ్వినిశ్రీ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. "గుండమ్మ గారి కథ" సీరియల్ లొ ప్రధాన పాత్ర పోషించిన పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరితోను‌ ఎక్కువగా కలవలేకపోయింది. అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ తో ఎక్కువ సమయం ఉండటంతో కాస్త పాజిటివిటీని పొందినా అశ్వినిశ్రీతో గొడవ పెద్ద మైనస్ గా మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తను హౌస్ లో రూడ్ బిహేవియర్ లా అనిపించింది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ సరైనది కాదని అందరూ భావించారు. ఆ తర్వాత పూజామూర్తి ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.

పూజామూర్తి ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలని పోస్ట్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం తను 106K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం శుభశ్రీతో కలిసి ' కుకింగ్ ఛాలెంజ్ విత్ గుండమ్మ ' అనే వ్లాగ్ చేయగా.. దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అంతా బిబి మహోత్సవం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ప్రేమ, సంపద, మనశ్శాంతి, దయ, హీలింగ్, ప్రోగ్రెస్, బ్లెస్సింగ్స్ ఇలా అన్నీ లైఫ్ లో పొందాలని భావిస్తున్నాను అంటు పూజామూర్తి పోస్ట్ చేసింది‌. దీంతో పూజామూర్తి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే హౌస్ లో రెండు వారాలు మాత్రమే ఉన్న పూజామూర్తి కొంత ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే మీలో ఎంతమందికి పూజామూర్తి తెలుసో కామెంట్ చేయండి.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.