English | Telugu

‘మొగలిరేకులు’ ఫేమ్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత.. అసలేం జరిగింది?


అప్పట్లో జెమిని టీవీలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సీరియల్ కి వచ్చినంత క్రేజ్ ఇంకే సీరియల్ కి కూడా రాలేదు. ముఖ్యంగా ఈ సీరియల్ కి లేడీ ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ సీరియల్ లో ఇంద్రకి ఇద్దరు బ్రదర్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒక బ్రదర్ పేరు దయ.. అతని అసలు పేరు పవిత్రనాథ్ . ఇందులో నటించిన పవిత్రనాథ్ కు ఎంతో గుర్తింపు లభించింది. మొగలిరేకులు సీరియల్ లో తన పాత్ర మంచి హిట్ అవ్వడంతో పవిత్రనాథ్ ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే, కొన్నేళ్ల క్రితం ప్రవిత్రనాథ్ భార్య శశిరేఖ మీద సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త పవిత్రనాథ్ అమ్మాయిల పిచ్చోడు అని చెప్పింది.

పవిత్రనాథ్‌ తనను వేధిస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను కూడా ఆశ్రయించింది భార్య శశిరేఖ. మొగలిరేకులు, కృష్ణతులసి సీరియల్లో నటిస్తున్న పవిత్రనాథ్‌ 2009 లో శశిరేఖను పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి తనను వేధిస్తున్నాడని, భర్తతో పాటు అత్తామామల పోరు ఎక్కువైందంటూ షీ టీమ్స్‌కు కూడా ఫిర్యాదు చేసింది శశిరేఖ. అలాంటి పవిత్రనాథ్ గురించి ఒక షాకింగ్ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. పవిత్రనాథ్ ఇక లేరంటూ కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ వాళ్ళు పోస్ట్ లో రాసుకున్నారు. ఐతే అసలేం జరిగింది అనే విషయం ఎవరికీ తెలీదు. శశిరేఖ కొన్నేళ్ల క్రితం తన భర్త గురించి సోషల్ మీడియా ముందుకొచ్చి చాలా విషయాలను చెప్పారు కానీ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇక పవిత్రనాథ్ కూడా కృష్ణ తులసి సీరియల్ తర్వాత ఎక్కడా కనిపించలేదు.