English | Telugu
పూల్ లో కిస్ సీన్ పవన్ కళ్యాణ్ సర్ తో ఐతే ఒకే కానీ ...అర్జున్ కళ్యాణ్ వద్దు!
Updated : Mar 2, 2024
బాబు..బుల్ షిట్ గై మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అర్జున్ కళ్యాణ్, హీరోయిన్ కుషిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇందులో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు వీళ్ళు ఆన్సర్స్ ఓ రేంజ్ లో ఇచ్చారు. "ఒక వేళ నేను ఎవరైనా హీరోయిన్ తో స్ట్రక్ అవ్వాల్సి వస్తే శృతి హాసన్ తో స్ట్రక్ అవుతా" అని అర్జున్ చెప్పేసరికి "మరి శ్రీ సత్యకి ప్రొపోజ్ చేసింది ఫేకా అని హోస్ట్ అడిగేసరికి "ఎందుకు చేసాను ప్రపోజ్ చేయనేలేదు ఎప్పుడూ" అని చెప్పాడు. "నేను పవన్ కళ్యాణ్ తో స్ట్రక్ అవుతా..ఆయన్ని అలా చూస్తూ కూర్చుంటే చాలు.. ఇంకేం చేయను" అని చెప్పింది కుషిత. ఇక ఈ సినిమా గురించి చెప్తూ పూల్ లోపల కిస్ సీన్ పెడతామన్నారు కానీ వద్దు అన్నట్లు కుషిత చెప్పడంతో ఆ సీన్ ని ఆపేశారట. "ఐనా పూల్ లో కిస్ సీన్ పవన్ కళ్యాణ్ సర్ ఐతే ఒకే కానీ అర్జున్ కళ్యాణ్ వద్దు" అంది కుషిత. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చింది హోస్ట్ .
అందులో శ్రీసత్య చంద్రముఖి అని ఆమెకు రెండు మూడ్స్ ఉంటాయని చెప్పాడు. తర్వాత వసంత కృష్ణన్ శివగామి అని తాను తన మాట తప్ప ఎవరి మాటా వినదని చెప్పాడు. పూజిత పొన్నాల హైబ్రిడ్ పిల్లా అంటూ కామెంట్ చేసాడు. వైష్ణవి చైతన్య యాక్షన్ బాగా చేస్తుంది అంటూ చెప్పాడు అర్జున్ కళ్యాణ్. ఇక ఈ మూవీలో హీరోగా అర్జున్ కళ్యాణ్ ని రిఫర్ చేసింది కుషిత. కుషిత, అర్జున్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్...తనతో ఐతే కంఫర్ట్ గా నటించవచ్చు అని తెలిసి రిఫర్ చేసిందట. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా హౌస్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అర్జున్ కళ్యాణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ను వాడుకుంటూ బుల్లితెరపై, వెండితెరపై, సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోన్నాడు అర్జున్ కళ్యాణ్. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ కొత్త సినిమా " బాబు.. బుల్ షిట్ గై" అంటూ అర్జున్ కళ్యాణ్ అందర్నీ పలకరించబోతోన్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది.