డోర్ తీస్తే నీడ కనిపించేది కాదు...డోర్ వేస్తే నీడ కనిపించేది బాబోయ్!
బుల్లితెర మీద రవికిరణ్-సుష్మ కిరణ్ గురించి అందరికీ తెలుసు. వీళ్ళు రీసెంట్ గా గోవా ట్రిప్ వెళ్లారు. ఐతే ఈ గోవా ట్రిప్ కి అసలు ఖర్చు ఎంతయ్యింది...ఎం చేశారు వంటి ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్ అడిగారు. దానికి రవి-సుష్మ ఆన్సర్స్ చెప్పారు. తమ ట్రిప్ కి మొత్తం 88 వేలు ఖర్చయినట్టు చెప్పారు. గోవాని నవంబర్, డిసెంబర్, జనవరి ఎండింగ్ వరకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కొంతమంది గోవాలో దెయ్యాల్ని చూసారా అని అడిగేసరికి రవి-సుష్మ కూడా మొదట ఎందుకు ఇలా అడుగుతున్నారా అని అనుకున్నారట. అవును ఆ ఎక్స్పెరియన్సు జరిగింది.. దెయ్యమా, స్పిరిటా ఏమో కానీ ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ ఐతే కలిగిందని చెప్పాడు రవి కిరణ్. మూడో రోజు బీచ్ కి వేరే ప్లేసెస్ కి బాగా తిరిగే టైంలో ఇలా జరిగింది.