English | Telugu

చీర కట్టాలనే ఉంది కానీ.. ఆయన ఒప్పుకోరు!

తెరమీదకు, బయట కన్పించే లుక్స్ కి కొంతమంది నటీనటులు భిన్నంగా ఉంటారు. అయితే తెలుగు ఆడియన్స్ సినిమాలను ఎంతలా ఆదస్తారో, బుల్లితెర ధారావాహికలని అంతే ఆదరిస్తారు. ఇప్పుడు స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ లో నటిస్తున్న అప్పు ఎప్పుడు టామ్ బాయ్ గెటప్ లోనే కన్పిస్తుంది.

అయితే బ్రహ్మముడి సీరియల్ లో అప్పు అటిట్యూడ్ చూసి చాలామంది ఆడవాళ్ళు ఇన్ స్పైర్ అవుతున్నారు. గట్స్ ఉన్న మగాడిలా .. ఆడది ఎందులో తక్కువ కాదు అన్నట్టుగా ఆమె శైలి ఉండటమే దీనికి కారణం. అయితే తాజాగా అప్పు అలియాస్ నైనిషా ఓ ప్రైవేట్ ఇంటర్వూలో పాల్గొంది. అందులో తను ఎప్పుడు అలానే కన్పించడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది. నాకూ గ్లామర్ రోల్ చేయడం అంటే ఇష్టం. బ్రహ్మముడిలో అప్పు క్యారెక్టర్‌ని చూసి చాలామంది.. మీరు మేల్ గెటప్ తీసేసి అమ్మాయిగా ఎప్పుడు మారతారు. మీరు చీర కట్టుకుంటే.. కళ్యాణ్ (బ్రహ్మముడి సీరియల్‌లో అనామిక భర్త) వెంటనే పడిపోతాడని కామెంట్లు పెడుతున్నారు. దానికి మా డైరెక్టర్ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ డైరెక్టర్ ఒప్పుకున్నా ఛానల్ ఒప్పుకోదు.

నిజానికి నేను బ్రహ్మముడి సీరియల్ చేయాలని అనుకోలేదు. టామ్ బాయ్ అంటే ఏముంటుంది? గ్లామర్ ఉండదు ఏమీ ఉండదు. వద్దు నాకు అని చెప్పాను. కానీ ఛానల్ వాళ్లు బలవంతంగా ఒప్పించారు. ఈ క్యారెక్టర్ మీరే చేయాలి.. చాలా బావుంటుంది అని అన్నారు. మగరాయుడిలా కనిపిస్తే.. గ్లామర్ ఉండదు ఏమీ ఉండదని నాకు ఇంట్రస్ట్ కలగలేదు. అయిష్టంగానే ఒప్పుకున్నాను.. కానీ ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు మంచి పేరు వచ్చింది. ఆ ఫేమ్ చూసి పర్లేదు టామ్ బాయ్‌గా చేయొచ్చు అని అనిపించింది. అప్పటి నుంచి ఇంట్రస్ట్‌గా చేస్తున్నా. నా వాకింగ్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ మొత్తం డైరెక్టర్ కుమార్‌గారే చెప్తారు. క్రెడిట్ మొత్తం ఆయనదే అంటూ చెప్పుకొచ్చింది. ‌ఇలా బ్రహ్మముడి సీరియల్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది అప్పు అలియాస్ నైనిషా. మరి బ్రహ్మముడి సీరియల్ లో అప్పు నటనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుని చీరలో చూడాలనుకునేవారు కామెంట్ చేయండి.