English | Telugu

Eto Vellipoyindhi Manasu : చెల్లెలి ప్రేమని సీతాకాంత్ అర్థం చేసుకొని న్యాయం చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -37 లో.. నేను ధన లేకుండా ఉండలేను. నేను తప్పు చేశాను. నాకు చావే సరైన శిక్ష అని తన అన్నయ్య సీతాకాంత్ కి సిరి బాధని చెప్పుకుంటు ఎమోషనల్ అవుతుంది. నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేసావ్ ? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదని సీతాకాంత్ అనగానే. నేను తప్పు చేశాను.. నేనిప్పుడు ప్రెగ్నెంట్ అని సిరి అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.. నీ ముందు నిల్చునే అర్హత కూడా నాకు లేదు. నీ నమ్మకాన్ని వమ్ము చేసాను. మన శత్రువు కొడుకని నేను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితేంటని సిరి బాధపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు..

Brahmamudi : నాకు బుజ్జిలాంటి అమ్మాయి కావాలి.. నువ్వు ఆగవే పొట్టిజుట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -348 లో.. రాజ్, కావ్య, భాస్కర్ కలిసి కనకం-కృష్ణమూర్తిల ఇంటికి వెళ్తారు. ఇక ఓవర్ యాక్షన్ కి కేరాఫ్ కనకం తన నటన మొదలెడుతుంది‌. భాస్కర్ కి కనకం ఎక్కువ విలువ ఇస్తూ చేస్తే.. ఆ  యాక్టింగ్ ని రాజ్ తట్టుకోలేకపోతాడు. మీరు మా ఇంట్లోకి వచ్చి టీ అయిన తాగి వెళ్ళండని రాజ్ తో కనకం అనగానే.. అమ్మ తను కూడా మాతో పాటు ఇక్కడ ఉండడానికి వచ్చాడని కనకంతో కావ్య అంటుంది. అలా కావ్య అనగానే.. అవును ఇది మా అదృష్టమంటు కనకం అంటుంది. మీరు వచ్చారంటే నాకు ఇంక నమ్మాలనిపించడం లేదని అప్పు అంటుంది.

నా వెయిట్ ఎంతో తెలుసా.. జస్ట్ 60!

దీప్తి సునైనా సోషల్ మీడియాలో క్యూట్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని, ఫాన్స్ ని తన ఫన్నీ కామెంట్స్ తో అలరిస్తూ ఉంటుంది. అలాంటి సునయన రీసెంట్ గా "ఆస్క్ మీ" అని అడిగేసరికి ఇంకా ఊరుకుంటారా నెటిజన్స్ వెంటనే "నీ వెయిట్ ఎంత దీపు" అని అడిగేసారు ఒక నెటిజన్..దీపు ఊరుకుంటుందా "60 కేజీలు" అంటూ తన ముక్కును ముప్పయ్యారు వంకర్లు తిప్పుతూ  ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. "శివ జ్యోతి ఆర్ గంగూలీ..ఎవరిష్టం" అనేసరికి "ఎప్పుడైనా అండ్ పెట్టాలి ఆర్ పెట్టొద్దు" అని ఘాటుగా స్వీటుగా వార్నింగ్ ఇచ్చింది. "రెండు అకౌంట్స్ ఉన్నాయా" అనేసరికి " ఒకటి కాదు రెండు కాదు ఐదు అకౌంట్స్ ఉన్నాయి...ఒకటి బ్లాక్ చేస్తే ఇంకో అకౌంట్ తో వస్తా" అని చెప్పింది.