English | Telugu

రిక్కీ ఫెయిల్ అవడంతో బాధపడుతున్న డాక్టర్ బాబు...

మంజుల-నిరుపమ్ బుల్లితెర మీద చక్కని నటీనటులు..ఐతే ఇప్పుడు నిరుపమ్ డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్ లో నటించి అలరించాడు. ఇప్పుడు కార్తీకదీపం సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అబ్బాయి రిక్కీతో ఒక ప్రాంక్ వీడియోని ప్లాన్ చేశారు. రిక్కీ ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. మెయిన్ ఎగ్జామ్స్ ఐపోయేసరికి తనకు మార్క్స్ సరిగా రాలేదు అని సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాడని మళ్ళీ అదే క్లాస్ లో ఉండాలి అంటూ వాళ్ళ మొబైల్ కి స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టుగా ప్లాన్ చేశారు. చివరికి రిక్కీకి వీడియో చేస్తున్నట్టు తెలీకుండా కెమెరాని హైడ్ చేసి మరీ వీడియో చేశారు. ఆ ఫెయిల్ మెసేజ్ ని రిక్కీకి చూపించేసరికి అస్సలు నమ్మలేదు. ఐనా ఆదివారం రోజున స్కూల్ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేస్తారు అని అడిగాడు.

అన్ని క్లాస్ ఎగ్జామ్స్ లో చక్కగా అటెండ్ చేసి ఇప్పుడు ఈ మెయిన్ ఎగ్జామ్స్ లో ఎందుకు బాగా రాయకుండా ఉంటాను. ఈ విషయాన్ని నమ్మను స్కూల్ కి వెళ్లి టీచర్స్ చెప్పాకే నమ్ముతాను అని గట్టిగా పట్టుబట్టాడు. ఐనా మంజుల-నిరుపమ్ ఊరుకోలేదు. రిక్కీని నమ్మించడానికి చాలా ట్రై చేశారు. చిన్న క్లాసెస్ లో ఉన్నప్పుడు ఎవరూ ఫెయిల్ చేయరు కానీ పెద్ద క్లాసెస్ కి వచ్చాక చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు..ఐనా అన్ని ఎగ్జామ్స్ కరెక్ట్ గానే అటెండ్ చేసావా అంటూ పదేపదే ప్రశ్నించారు. రిక్కీ మాత్రం అస్సలు నమ్మలేదు. స్కూల్ నుంచే ఫెయిల్ ఐన మెసేజ్ వచ్చింది కానీ అది ట్రస్టెడ్ సోర్స్ కాదు ఎవరైనా ఊరికే పంపి ఉంటారేమో అన్నాడు రిక్కీ. ఊరికూరికే స్కూల్ నుంచి ఎందుకు ఇలాంటి మెసేజెస్ పంపిస్తారు అని సీరియస్ అయ్యింది మంజుల. ఇక రిక్కీ నమ్మకపోయేసరికి నిరుపమ్ ఇదంతా ప్రాంక్ అంటూ చెప్పేసాడు. మంజుల చేసిన మిస్టేక్స్ ని చెప్పాడు నిరుపమ్. వాట్సాప్ లో ఎవరూ స్కూల్స్ మెసేజెస్ తొందరగా పెట్టారు. నార్మల్ మెసేజెస్ పంపిస్తారు. షార్ట్ కట్ వర్డ్స్ ని స్కూల్ వాళ్ళు యూజ్ చేయరు. మరీ ఫెయిల్ అయ్యేంత బాగా రాయకుండా లేను అని చెప్పాడు రిక్కీ. ఇక ఫైనల్ గా రిక్కీకి గేర్ సైకిల్ ని గిఫ్ట్ గా ఇచ్చారు మంజుల-నిరుపమ్..రిక్కీ చదివేది ఐసిఎస్సి సిలబస్ అని అందులో 11 సబ్జెక్ట్స్ ఉన్నాయని వాటిల్లో అన్నీ 90 పైనే మార్క్స్ వచ్చాయని చెప్పారు. ఈ జెనెరేషన్ మొత్తం ముదుర్లే వాళ్ళను మిస్ లీడ్ చేయడం అంతా ఈజీ కాదు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.