English | Telugu

శుభశ్రీ రాయగురు పోస్ట్ చేసిన వీడియో వైరల్.. అందులో అసలేం ఉందంటే!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్‌ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్‌, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన శుభశ్రీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా చేసింది.

ప్యానిక్ అవకుండా ఇంటర్ ఎగ్జామ్స్ బాగా రాయండి అన్న రచ్చ రవి...

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు అంటే చాలు చాలామంది వచ్చిన ప్రశ్నలనే చూసి, చదివిన పాఠాలే ఐనా రాయడానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో  స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కమెడియన్ రచ్చ  రవి కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్టూడెంట్స్ కి నాలుగు మంచి మాటలు చెప్పాడు. 'పరీక్ష అంటే ముందు టెన్షన్ పడొద్దు, ప్యానిక్ అవ్వొద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు వచ్చే ప్రతీ ప్రశ్న ఏడాది నుంచి మీరు చూసిందే, చదివిందే. కాబట్టి ఎగ్జాంకి వెళ్లే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఒకసారి రివిజన్ లా చూసుకోండి. కూల్ గా ఎగ్జాంని అటెండ్ చేసి బాగా రాయాలి.. రాస్తారు కూడా..నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చదివిన లైసెన్స్ కదా.

ఆడవాళ్ళ వల్ల మగవాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు...

ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద నటి మాధవి ఫుల్ ఫైర్ అయ్యింది. ప్రతీ ఒక్క మహిళా ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఫెమినిస్ట్ అంటే ఏంటి మగవాళ్ళతో సమానంగా చదువుకోవడం, ఉద్యోగం చేయడం అదే ఫెమినిజం అంటే. అంతే గాని ఇంకేం కాదు. ఇంకో విషయం ఏమిటి అంటే మహిళలు శారీరకంగా కొంత వీకర్ సెక్షన్ కాబట్టి ఈ న్యాయస్థానాలు మహిళల కోసం ఎన్నో రకాల సెక్షన్స్ పెట్టాయి. కానీ కొంత మంది ఆడవాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. భర్తల మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారు. ఆ భర్తలు కేసుల నుంచి బయట పడలేక అల్లాడిపోతున్నారు. రకరకాల ఫేక్ కేసులు పెట్టేసి మగాళ్లను హింసకు గురి చేస్తున్నారు.

Krishna Mukunda Murari:ఆ విషయం తెలిసి షాకైన కృష్ణ.. ఇక అసలు కథ మొదలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -404 లో....కృష్ణ, రేవతి ఇద్దరు హాల్లో కూర్చొని మురారి ఇంకా రాలేదని వెయిట్ చేస్తుంటే.. అపుడే ముకుంద వస్తుంది. మురారి ఏమైనా కన్పించాడా అని ముకందని కృష్ణ అడుగుతుంది. లేదు నేను ఇక్కడ దగ్గరలో వాకింగ్ చేసి వస్తున్నానని ముకుంద చెప్తుంది. ఇదిగో కాఫీ ఏసీపీ సర్ కోసం చేసాను. సర్ రాలేదు కదా నువ్వు తీసుకొ అని కృష్ణ అనగానే.. మురారి కోసం చేసిన కాఫీ ఇస్తున్నావ్? మురారిని ఎప్పుడు ఇస్తావని ముకుంద తన మనసులో అనుకుంటుంది. మురారికి నిజం చెప్పి.. నా బాధని తీర్చుకున్నాను. ఇక అంతా మురారి చూసుకుంటాడని ముకుంద మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది.

సెలబ్రిటీస్ హోమ్ టూర్స్...ఆదిని చెడుగుడు ఆడేసుకున్న చిన్నారి!

ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోమ్ టూర్స్ సెగ్మెంట్ మంచి ఫన్నీగా ఉంది. ముందుగా జడ్జి ఇంద్రజ హోమ్ టూర్ తో స్టార్ట్ అయ్యింది. ఇంద్రజ ఒక పూరి గుడిసె ముందు నిలబడి ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటో చూసి ఇంద్రజ షాకైపోయింది. ఇక ఆది ఇంద్రజ ఆ గుడిసెలో ఎందుకు ఉందో చెప్పాడు. "అంటే ఆవిడకు ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు ఇచ్చేసి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు." అని చెప్పాడు. తర్వాత రష్మీ ఇంటిని చూపించారు. రష్మీ రేకుల ఇంటి ముందు నిలబడి ఉంది. "ఇంద్రజ తనకు ఉన్నదంతా దానం చేసి పూరింట్లో ఉంటోంది. రష్మీ మాత్రం ఉన్నదాన్ని రెంట్లకు ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్డులో ఉంటోంది." అని చెప్పాడు ఆది. తర్వాత ఆది హోమ్ టూర్ పిక్ ని చూపించారు.