రివ్యూ .... పీకే
హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తున్నాం.. అంటూ మనవాళ్లు విర్రవీగుతుంటారు. మా సినిమా హాలీవుడ్ సినిమాలా ఉంటుందండీ.. నిజ్జం.. నమ్మండి.. అంటూ మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. హాలీవుడ్ అక్కర్లెద్దు. కనీసం బాలీవుడ్ రేంజులో ఆలోచించడానికి మనకు ఇంకో ఇరవై ఏళ్లు పడుతుంది. ఓ భేజా ఫ్రై, ఓ లంచ్ బాక్స్, ఓ త్రీ ఇడియట్స్, ఓ ఓ మైగాడ్... ఇప్పుడు పీకే!! స్టార్ హీరో దొరగ్గానే.. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాటని దూర్చేసి, విలన్ ఇంట్లో