English | Telugu
అఖిల్ సినిమాలో నాగ్??
Updated : Dec 20, 2014
అక్కినేని అభిమానులకు ఇది శుభవార్త! సిసింద్రీ అఖిల్ హీరోగా ఇంట్రీ ఇచ్చిన ఆనందంలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్‌కి ఇది బోనస్! ఎందుకంటే అఖిల్ సినిమాలో నాగార్జున కూడా కనిపించబోతున్నాడు. నాగ్ ఓ చిన్న పాత్రలో స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఇందుకు నాగ్ కూడా అంగీకారం తెలిపాడట. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే క్లాప్ కొట్టుకొంది. జనవరి 7నుంచి షూటింగ్ మొదలు పెడతారు. ఇదో సోషియో ఫాంటసీ కథ అని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉందట. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో హీరోయిన్ ఎవరనేది తేలిపోతుంది. మరి ఈ సినిమాలో నాగ్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఎంతసేపు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.