English | Telugu
సమంత స్టన్ అయిపోయిందట
Updated : Dec 20, 2014
పీకే... పీకే.. పీకే.... సినీ ప్రపంచం అంతా పీకే నామస్మరణ చేస్తోంది. బాలీవుడ్ స్టార్లు, సౌతిండియన్ సెలబ్రెటీలంతా పీకే మత్తులో మునిగిపోయారు. సమంత కూడా పీకే చూసేసింది. తొలి రోజే థియేటర్లో కూర్చుని పీకేగా అమీర్ ఖాన్ విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయింది. ''రాజ్‌కుమార్ హిరాణీ మాస్టర్ పీస్ ఇది. అమీర్ ఖాన్ దేవుడు సృష్టించిన ఓ అద్భుతం'' అంటూ ఈ సినిమాకి కొనియాడింది సమంత. ఈ సినిమా చూస్తున్నంత సేపూ స్టన్ అయిపోయిందట సమంత. పీకే చూడకపోతే లైఫ్‌లో ఏదో కోల్పోయినట్టే అన్నట్టు మాట్లాడుతోంది. సాధారణంగా సమంత తొలి రోజే థియేటర్‌కి వెళ్లిపోదట. టాక్ తెలుసుకొని వెళ్తుందట. కానీ అమీర్ సినిమా అనేసరికి... టాక్ గురించి పట్టించుకోకుండా సినిమాకెళ్లా అని చెప్తోంది. సమంతతో పాటు టాలీవుడ్ హీరోలూ, దర్శకులూ అమీర్‌ని మెచ్చుకొంటూ ట్వీట్లు చేశారు. మరో వారం రోజుల వరకూ ఎవరి ట్వీట్ చూసినా అమీర్ ఖాన్ గురించే! అంత సత్తా ఈ సినిమాలో ఉంది మరి.