English | Telugu

పవన్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ముకుంద’. ఈ చిత్రానికి పోటీగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ ‘చిన్నదాన నీకోసం’ వస్తోంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో మెగా అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయే ప్రమాదంవుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తిరుపతిలో జరిగిన 'చిన్నదాన నీ కోసం' ఫంక్షన్ నితిన్ రెచ్చిపోయి పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకొని పవన్ మద్దతు పొందాడు. మరోవైపు ‘ముకుంద’ యూనిట్ నుంచి ఆఖరికి వరుణ్ తేజ్ కూడా పవన్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడంలేదు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో మెగాస్టార్ గురుంచి చెబుతున్నాడే తప్ప పవర్ స్టార్ ప్రస్తావన ఎక్కువగా తీసుకురావడంలేదు. దీంతో పవన్ అభిమానులు తమ పూర్తి మద్దతు నితిన్‌కే ఇచ్చేస్తారని అంటున్నారట. మరి మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ సపోర్ట్‌ చేస్తోన్న ఈ సినిమాల్లో ఏది విన్నర్‌గా నిలుస్తుందో?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.