English | Telugu

'పీకే' అమీర్ ఖాన్ ఇరగదీశాడు

మన స్టార్ హీరోలు స్టార్ డమ్, స్టార్ డమ్ అంటూ క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాట‌ని దూర్చేసి, విల‌న్ ఇంట్లో హీరో దూరి నానా యాగీ చేసి, టికెట్టు కొన్న పాపానికి ప్రేక్ష‌కుల్ని రాచి రంపాలు పెట్టేస్తుంటారు. కానీ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాత్రం, సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదని నమ్మే స్టార్ హీరో. సందేశాత్మక సినిమాలతో ఎంతటి ఘనవిజయాలు సాధించవచ్చో అమీర్ చేసి చూపిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలు, ప్రోగ్రాంలు ఇందుకు నిదర్శనం. లేటెస్ట్ గా వచ్చిన 'పీకే' అమీర్ ఖాన్ కెరీర్ లో మరో మైలు రాయిగా మిగిలిపోతుంది. ఆయనలోని గొప్ప నటుడికి ఇది మరో తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోతుంది. గ్రహాంతరవాసి పాత్రకి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ని మలచుకున్న తీరు అద్భుతం. పీకే క్యారెక్టర్లో అమీర్ వేసిన గెటప్స్, అత్యంత సహజమైన నటన, ఇతనొక్కడికే సాధ్యమేమో అనిపిస్తుంటుంది. అమీర్ ఖాన్ ఇలాగే నవ్విస్తూనే ఆలోచింపజేసే పీకే లాంటి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.