English | Telugu

‘జబర్‌దస్త్‌’ కార్యక్రమ౦ ఆగదు

ఈటీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కార్యక్రమం గురించి తెలిసిందే. ఈ నెల 18న టెలికాస్ట్‌ అయినా ఎపిసోడ్‌లో కల్లు వృత్తిని.. మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిట్‌ చేశారని ఆరోపిస్తూ వేణుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో, కమెడియన్‌ వేణుకి అంతర్గతంగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వేణుపై దాడిని ఖండిరచిన బుల్లితెర, సినీ కళాకారులు.. తమకు న్యాయం జరగాలంటూ ఆందోళన చేపట్టారు. నటులుగా తాము ఏమన్నా తప్పు చేస్తే, తాము చేసే సినిమాలు లేదా టీవీ ప్రోగ్రామ్స్‌పై అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా పోలీసులను ఆశ్రయించవచ్చుగానీ, దాడులు చేయడమేంటని నాగబాబు ప్రశ్నించారు. లక్షసార్లు దాడి జరిగినా జబర్‌దస్త్‌ కార్యక్రమం ఆగే ప్రసక్తే లేదని నాగబాబు చెప్పారు. ఉండాలో, ప‌రిశ్ర‌మ వ‌దిలి వెళ్లిపోవాలో అర్థం కావ‌డం లేద‌ని ధ‌న్‌రాజ్ చెబుతున్నాడు. ఒక వ్య‌క్తిపై మ‌రో వ్య‌క్తి దారి చేయ‌డం ఏమిట‌ని చంటి ప్ర‌శ్నిస్తున్నాడు. అస‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే మాకు భ‌య‌మేస్తోంద‌ని జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ చెబుతోంది. మొత్తానికి వేణు పై దాడి.. ప‌రిశ్ర‌మ‌లో కొద్ది పాటి క‌ల‌క‌లం రేపింది. ఇలాంటి దాడులు జ‌ర‌గ‌డం మంచిది కాద‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసే బాధ్య‌త అటు న‌టీన‌టుల‌కూ, ఇటు టీవీ యాజ‌మాన్యానికీ ఉంద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వారా త‌న అభిప్రాయం వెలుబుచ్చారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.