English | Telugu

ముకుంద‌, చిన్న‌దానా ప‌రిస్థితేంటి??

ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. ఒకటి ముకుంద‌, రెండోది చిన్న‌దానా నీ కోసం. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ముకుంద‌. మెగా హీరో సినిమా కాబ‌ట్టి.. ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకొన్నారు. దానికి తోడు శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. ఆయ‌న గ‌త సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువ‌తరాన్నీ మెప్పించాయి. ఈసారీ ఆయ‌న క్లీన్ సినిమానే తీశార‌న్న సంగ‌తి అర్థమ‌వుతోంది. కాబ‌ట్టి ఓపెనింగ్స్‌కి తిరుగు లేక‌పోవ‌చ్చు. దానికి తోడు చిరంజీవి త‌న ఫ్యాన్స్ అంద‌రినీ స‌మీక‌రించి 'వ‌రుణ్ తేజ్ ని మీరూ ఆశీర్వ‌దించండి..' అంటూ వాళ్ల స‌పోర్ట్ కూడా తీసుకొన్నాడు. బంధాలు, యువ‌త‌రం ఆలోచ‌న‌లు, ప‌ల్లెటూర్లో ప‌చ్చంద‌నం.. ఈ కాన్సెప్ట్‌తో ఈ సినిమా లాగించేశాడు శ్రీ‌కాంత్ అడ్దాల‌. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే ఈ సినిమాపై నెగిటీవ్ రిపోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దాంతో మెగా ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇటీవ‌ల ముకుంద చిత్రాన్ని కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల‌కు ప్ర‌త్యేకంగా చూపించారు. ''సినిమా మ‌రీ స్లోగా ఉంది... సెకండాఫ్ ల్యాగ్‌..'' అంటూ రిపోర్ట్ వ‌చ్చింది. మ‌రీ ఇంత స్లో నేరేష‌న్ ఈత‌రం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా? అనేదే అనుమానం. దానికి తోడు.. ద‌ర్శ‌కుడు అరిగిపోయిన క‌థ‌ని తీసుకొన్నాడ‌ని తెలుస్తోంది. కాక‌పోతే ఫ్యామిలీ ఎమోష‌న్స్, ఫాద‌ర్ రిలేష‌న్‌ని ద‌ర్శ‌కుడు బాగానే మిక్స్ చేశాడ‌ట‌. అదొక్క‌టే ఈసినిమాని గ‌ట్టెక్కిస్తుందంటున్నారు. పైగా వ‌రుణ్‌తేజ్ మొద‌టి సినిమా. వ‌రుణ్ ఎలా చేశాడో అన్న ఆస‌క్తితో కూడా జ‌నం థియేట‌ర్లకు రావొచ్చు.

ఇక ఇదే వారం నితిన్ చిన్న‌దాన నీకోసం అంటూ ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈసినిమాపైనా మంచి అంచ‌నాలే ఉన్నాయి. కార‌ణం... నితిన్ మంచి ఊపుమీదున్నాడు. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, హార్ట్ ఎటాక్‌... ఇలా త‌న‌కు న‌ప్పే క‌థ‌ల్ని ఎంచుకొంటున్నాడు. ఆ ఫామ్ ఈ సినిమాకి బీభ‌త్స‌మైన ఓపెనింగ్స్ తీసుకురావ‌డం ఖాయం. దానికి తోడు క్రిస్మ‌స్ సెల‌వ‌లూ కలిసొస్తాయి. క‌రుణాక‌ర‌న్ బ్రాండ్ ఈ సినిమాపై ప‌డింది. వెర‌సి... ప్రారంభ వ‌సూళ్ల‌కు ఢోకా ఉండదు. నితిన్ ఎన‌ర్జీ, వినోదం ఈసినిమాకి ప్ల‌స్ పాయింట్స్‌. అయితే సెకండాఫ్ ట్రాక్ త‌ప్పింద‌ని ల్యాబ్ రిపోర్ట్. అనూప్ మ్యూజిక్ అంత‌గా ప్ల‌స్ కాలేద‌ట‌. కాక‌పోతే క‌నీసం యావ‌రేజ్ స్థాయిలో నిల‌బ‌డే ఛాన్సుంద‌ని చెప్పుకొంటున్నారు. మొత్తానికి రెండు సినిమాల రిపోర్ట్.. సో సో గానే వ‌చ్చింది. మ‌రి ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల్ని ఈ సినిమాలు త‌ల‌కిందులు చేస్తాయో, లేదంటే... యావ‌రేజ్ సినిమాగా మిగిలిపోతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.