English | Telugu

చంద్రకళ భయపెట్టలేకపోయింది

తమిళంలో విజయవంతమైన ‘అరన్‌మనై’ చిత్రాన్ని తెలుగులోకి ‘చంద్రకళ’గా అనువదించారు. ఈ సినిమా అభిమానుల నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకొంది. చంద్రముఖి’ చిత్రాన్నే కాస్త అటు ఇటుగా మార్చి, ‘అరుంధతి’, ‘అమ్మోరు’ తదితర చిత్రాల నుంచి తలా ఒక పాయింట్‌ తీసుకొచ్చి.. హారర్‌, కామెడీ మిళితం చేసి కిచిడీ చేశారట. దర్శకుడు సుందర్‌ రాసుకున్న కథలో కొత్తదనం లేదట. ప్రతి సీన్‌ ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చూసిందే అనిపిస్తుంది. కనీసం స్క్రీన్‌ప్లే పరంగా అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నో హారర్‌ సినిమాలు చూసేసి ఉన్న ప్రేక్షకులకి ‘చంద్రకళ’లో ఎలాంటి ప్రత్యేకతలు కనిపించవట. హారర్‌ ఎఫెక్టివ్‌గా లేకపోవడం, కామెడీ నవ్వించకపోవడంతో అసలే కొత్తదనం లేని ఈ చిత్రం బాగా విసిగించిందట.