ఉన్నతాధికారులు హామీతో ధర్నాను విరమించిన ఢిల్లీ పోలీసులు...
ఢిల్లీ పోలీసులు శాంతించారు, పదకొండు గంటల పాటు సాగిన ధర్నాను విరమించారు. పోలీసు సిబ్బంది డిమాండ్లన్నీ నెరవేర్చుతాం అంటూ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తీస్ హజారీ కోర్టుల సముదాయంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య శనివారం గొడవలు జరిగాయి.