English | Telugu

నిరసనలో ఉన్న రెవెన్యూ అధికారులకు ఖంగు తినిపించిన మహిళా రైతు...

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగులు నిరసనలకు దిగారు అయితే వీరికి కొన్ని చోట్ల చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోను మహిళా రైతు నిలదీసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో జరిగింది. నెల రోజుల నుంచి పట్టాదారు పాసు పుస్తకం కోసం వీఆర్వో ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నాడని మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం కోసం రెండు మూడు సార్లు లంచం తీసుకున్నాడని అయినా ఇంకా పాస్ పుస్తకం ఇవ్వలేదని మండిపడింది.


మహిళా రైతు నిలదీయ్యటంతో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ సిబ్బంది అంతా కంగుతిన్నారు, నిరసనను ఆపేసి కార్యాలయం లోకి వెళ్లిపోయారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం మరికొడ గ్రామంలో నిన్న విజయా రెడ్డి చనిపోయిన తర్వాత గుండాల మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు మండలానికి సంబంధించిన వీఆర్వోలు, తహసిల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జితో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళ తన ల్యాండ్ వ్యవహారంలో మరిపెడ గ్రామానికి చెందిన వీఅర్వోను ఎదురించే ప్రయత్నం చేసింది.


దీనికి సంబంధించి మరిపెడ గ్రామ వీఆర్వో మాట్లాడుతూ ఆ ల్యాండ్ కి సంబంధించిన విషయంలో 2009 లో మార్తమ్మ తమ తమ్ముళ్ళ నుంచి భూమి రెజిస్ట్రేషన్ చేసుకుందన్నారు. అయితే ఆ భూమి రెజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఆ భూమిలో ఒక సెల్ టవర్ పెట్టించి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమ్ముళ్ళకు మద్దతు ఇచ్చింది మార్తమ్మ. ఇటీవలె పట్టాలు ఆదునీకరణ చేసే క్రమంలో తన పట్టా మార్పునకు రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంది, అయితే దీనికి మార్తమ్మ సోదరులు ఇద్దరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో పట్టాను అమలు చేయటం వీలు కాదని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పారు.


తనకు పట్టా ఇవ్వకపోవటానికి వాళ్ళెవరు, మీరెవరు అనీ, మార్తమ్మ తమ్ముళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తనకు పట్టా ఇవ్వట్లేదు అని అదే విధంగా తన వద్ద కూడా రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే నిరసనలో ఉన్న రెవెన్యూ అధికారులను నిలదీసింది.