English | Telugu

బొగ్గు విషయంలో కేంద్రానికి లేఖ రాసిన ఏపి సిఎం జగన్...

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు, ఒడిస్సా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపి జెన్ కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5010 మెగా వాట్లని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ క్యాలరీస్ నుంచే సరఫరా అయ్యేదన్న జగన్ కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని అన్నారు.


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గుమీదే ఆధారపడుతున్నామని వివరించారు. ఒడిస్సాలోని ఐబీ వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, తెలంగాణ బొగ్గు సంపద రాష్ట్రాలని చెప్పారు జగన్. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ నుంచి ఏ పీ ఎం డీ సీ కి ఒక గనిని కేటాయించారన్న ముఖ్యమంత్రి ప్రతి గని నుంచి 5 ఎం ఎం టీ ఎల్ తీసుకొచ్చారని చెప్పినట్లుగా వివరించారు.


అయితే బొగ్గు వెలికి తీయడానికి నిర్వహణ వ్యయం అధికంగా ఉందని బొగ్గు గనుల చట్టం 2015 ప్రకారం ట్రాంచి ఆరు ను ఏపీ జెన్ కో వినియోగం కోసం ఏపీకి కేటాయించారని లేఖలో తెలిపారు జగన్. 2020 మార్చికి ఏపీ జెన్ కో 1600 మెగావాట్ల అదనపు ఉత్పాదనకు సిద్ధంగా ఉందన్నారు. ఒడిస్సా మందాకిని కోల్ బ్లాక్ ని ఏపీకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.