Eto Vellipoyindhi Manasu : మ్యాగజైన్ ఫోటో కోసం నందిని ప్లాన్.. భర్తని ఒప్పించిన భార్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -188 లో.....సందీప్, శ్రీలతలు కలిసి రామలక్ష్మి, సీతాకాంత్ లని దూరంగా ఉంచడానికి ప్లాన్ చేస్తారు. సీతాకాంత్, రామలక్ష్మిలు వస్తుండడం గమనించి యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు నిప్పుల గుండంలో నడుస్తానంటున్నావని శ్రీవల్లి, సందీప్ లు శ్రీలతని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ జాతకం జ్యోతిష్యునికి చూపించాను. అందులో ఏవో దోషాలు ఉన్నాయట.. మీరు ఇద్దరు కలిసి ఉంటే మీకు గండం ఉందట అని శ్రీలత అంటుంది. దానికి పరిహారంగా ఇది చేస్తానంటున్నానని అనగానే.. వద్దని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఏ నిప్పుల గుండంపై నడవాల్సిన అవసరం లేదు.. నువ్వు చెప్పినట్టే దూరంగా ఉంటామని సీతాకాంత్ అంటాడు.