English | Telugu

Karthika Deepam : కార్తిక్ కి సపోర్ట్ గా దీప.. జ్యోత్స్నతో పెళ్ళి అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -148 లో.....తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండొద్దంటే దీప తప్పు చేసిన తననికి ఇంట్లో ఎందుకు ఉంచారని సుమిత్రని‌ జ్యోత్స్న అడుగుతుంది. దీప ఏ తప్పు చేయలేదని సుమిత్ర అంటుంది. బావకి ఆ పరిస్థితి రావడానికి కారణం దీప అని జ్యోత్స్న వాదిస్తుంది. అసలు తనని కాపాడబోయి ఈ సిచువేషన్ తెచ్చుకున్నాడని జ్యోత్స్న అనగానే మరి దీప నన్ను కూడా కాపాడింది కదా దానికేం అంటావని సుమిత్ర అడుగుతుంది. అసలు ఆ నర్సింహా దీపల వల్లే నీ కూతురు ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని పారిజాతం అంటుంటే.. శివన్నారాయణ వచ్చి తనపై కోప్పడతాడు.

నా కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నా అల్లుడికి అలా అయింది. నీ కంటే ఎక్కువ బాధ నాకే ఉందని దశరత్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం లు ఇద్దరు కార్తీక్ దగ్గరికి బయలుదేర్తారు. నువు జ్యోత్స్న వచ్చాక ఒకసారి తనతో మాట్లాడమని సుమిత్రతో శివన్నారాయణ‌ అంటాడు. దాని పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలని చిన్నప్పటి నుండి బావనే నీ భర్త అని చెప్పామని సుమిత్ర అంటుంది. మరొకవైపు నరసింహా అలా చేసాడని అనసూయ బాధపడుతుంది. నేను ఇక ఇక్కడ ఉండలేను.. వాడు చేసిన పనికి వీళ్ళు ఏదో ఒకటి అంటుంటే.. నేను భరించలేనని అనసూయ అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. నన్ను కార్తీక్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని శౌర్య అనగానే.. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు.. మనం వెళ్ళకూడదని దీప అంటుంది. టాబ్లెట్ వేసుకున్నానని చెప్పాలి కదా అని శౌర్య అంటుంది.

మరొకవైపు ఆ దీప విషయంలో కలుగజేసుకోకని చెప్పాను కదా ఇప్పుడు చూడు అసలు ఆ దీపని ఈ రెండు కుటుంబాల నుండి తరిమెయ్యాలి. ఆ దీప ఎదురు పడనివ్వు తన సంగతి చెప్తానని శ్రీధర్ అంటుండగా.. అప్పుడే దీప వస్తుంది. దీపపై శ్రీధర్ కోప్పడతాడు. కోపంగా హాల్లోకి వెళ్లి కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న పారిజాతంలు వస్తారు. గుడ్ మార్నింగ్ అని జ్యోత్స్న అనగానే బ్యాడ్ మార్నింగ్ అంటూ శ్రీధర్ అనగానే.. ఏమైందని జ్యోత్స్న అడుగుతుంది. విజిటర్స్ వచ్చారని కోపంగా చెప్తాడు. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మమ్మల్ని రాకని చెప్పావ్ దీపకి చెప్పలేదా బావ అని జ్యోత్స్న అంటుంది.‌ వద్దని చెప్పినా నేను వస్తాను. ఇప్పుడు ఇంట్లో సాయం చెయ్యడానికి అని దీప అంటుంది. అంటే వంటమనిషిగానా, పనిమనిషిగానా అని పారిజాతం అంటుంది. మనిషిగా వచ్చిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.