English | Telugu

ఆమెను చీరకొంగుతో చేతులు కట్టేసి.. ఏం చేశాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -198 లో.... సీతాకాంత్ మేనేజర్ దగ్గరికి నందిని వచ్చి సీతాకాంత్ కార్ కి డ్రైవర్ లేడన్న విషయం.. మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతుంది‌. రామలక్ష్మి గారు పెళ్లి చేసుకోకముందు సర్ కి డ్రైవర్ గా ఉన్నారు అంతే కాదు రామలక్ష్మి గారిది పర్ ఫెక్ట్ డ్రైవింగ్ అని మేనేజర్ చెప్తాడు. ఆ తర్వాత నందిని సీసీటీవీ ఫుటేజ్ కోసం సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ లో ఏం ఉండదు. ఆ తర్వాత రామలక్ష్మి డ్రైవింగ్ చేసిన కార్ రిపేర్ చేస్తున్న మెకానిక్ కి నందిని ఫోన్ చేసి కార్ కండిషన్ ఏంటని అడుగుతుంది. కార్ బాగుంది మేడమ్ కానీ ఎవరో కార్ బ్రేక్ కావాలనే కట్ చేశారని చెప్తాడు.

ఆ తర్వాత నందిని కార్ పెట్టిన ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ వైర్ కట్ చేసే పరికరం దొరుకుతుంది. అది చూసి నిజమే ఎవరో కావాలనే ఇలా చేశారు.. సీతాని అలా చేయాలి అనుకున్నది ఎవరు? ఒకవేళ కార్ లో సీతా ఉంటే పరిస్థితేంటి? ఎలాగైనా కనుక్కోవాలని నందిని అనుకుంటుంది. మరొకవైపు స్వామి దగ్గరికి కావాలనే రామలక్ష్మి తీసుకొని వెళ్లిందా అని శ్రీలత ఆలోచిస్తుంది. అప్పుడే స్వామి దగ్గర ఉండే అతనికి శ్రీలత ఫోన్ చేసి సీతాకాంత్ వచ్చి ఏం మాట్లాడాడని అడుగుతుంది. వాళ్ళెప్పుడు కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలంటే మహా యాగం జరిపించాలని చెప్పాడని అతను చెప్తాడు. నేను విడగొట్టాలని ట్రై చేస్తుంటే మీరు కలిసి ఉండాలని పూజ చేస్తున్నారా అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వస్తుంది. గది అంతా చిందర వందరగా ఉండడం చూసి సర్దుతు ఉంటుంది. చేతికీ మళ్ళీ ఏదో తాకుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏమైంది నిన్ను ఏ పని చెయ్యకూడదన్నాను కదా అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. అయిన రామలక్ష్మి వినదు. తన చీర కొంగుతో తన చేతులు కట్టేస్తాడు. నొప్పిగా ఉందంటే కట్టు విప్పుతాడు. నన్నే కట్టేస్తారా అంటూ రామలక్ష్మి అలిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కిందకి వచ్చి సీతాకాంత్ సర్ పై అలిగాను.. నేను ఇప్పుడు దాక్కుంటాను.. మీరు చెప్పకండి అని సిరి పెద్దాయనలతో రామలక్ష్మి చెప్పి సోఫా వెనకాల దాక్కుంటుంది.

అప్పుడే రామలక్ష్మి అంటు సీతాకాంత్ కిందకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళిందంటూ అడుగుతాడు. ఏమో మాకేం తెలుసు ఏమైందని సిరి అడుగుతుంది. కోప్పడ్డానని అలిగిందని అంటాడు. సిరి సైగ చేస్తూ రామలక్ష్మి వెనకలున్న విషయం చెప్తుంది. దంతో రామలక్ష్మిని వెళ్లి పట్టుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి ఇంకా నా అలక తీరలేదంటూ పైకి వెళ్తుంది. అక్కడ సందీప్ శ్రీవల్లి, శ్రీలతలు రామలక్ష్మి గురించి మాట్లాడుకోవడం తను వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.