English | Telugu
Karthika Deepam2: కార్తిక్ కి ప్రాణం పోసిన శౌర్య.. గుండెల్ని పిండేసే ఎపిసోడ్!
Updated : Sep 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -147 లో... కార్తీక్ గురించి తెలిసి శౌర్య బాధపడుతుంది. నా కార్తీక్ కి ఏమైందంటూ ఏడుస్తుంటే.. దీప శౌర్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. దానికి కార్తీక్ బాబు అంటే ఇష్టమని తీసుకొని వెళ్తున్నావ్ కానీ దానికి ఉన్న జబ్బు గురించి నీకు తెలియదని అనసూయ అనుకుంటుంది. కార్తీక్ గురించి అందరు బాధపడుతుంటారు. బావ మాములుగా కావడానికి ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉంది కదా అని జ్యోత్స్న ఆశగా ఉంటుంది.
అప్పుడే దీప శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్ కి వస్తుంది. వాళ్ళని చూసి ఈ కాస్త కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని పారిజాతం అంటుంది. నేను కార్తీక్ ని చూడాలని శౌర్య అంటుంటే నిన్ను వెళ్లనివ్వనని పారిజాతం అంటుంది. దాంతో పారిజాతం చేతిని కోరికి మరి శౌర్య లోపలికి వెళ్తుంది. కోమాలోకి వెళ్తున్నాడని డాక్టర్ చెప్పగానే.. అందరు కార్తీక్ అంటూ పిలుస్తారు. ఎవరు పిలిచినా కార్తీక్ రియాక్ట్ కాడు.. శౌర్య వచ్చి కార్తీక్ అంటూ పిలవగానే మెల్లగా కదలడం చేస్తాడు. పాప పిలవగానే కదులుతున్నాడు.. తను స్పృహలోకి వస్తే ఇక ప్రాబ్లమ్ లేనట్టే నువ్వు పిలువు పాప అని డాక్టర్ అంటాడు. కార్తీక్.. కార్తీక్ అంటూ శౌర్య ఏడుస్తుంటే.. కార్తీక్ స్పృహలోకి వచ్చి రౌడీ అంటూ మాట్లాడతాడు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటికి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తాడు.
ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళాక తన చుట్టూ అందరు ఉంటారు. దంతో మీరు ఇలా నన్ను జాలిగా చూస్తుంటే.. ఇబ్బందిగా ఉంది ప్లీజ్ ఇక్కడ నుండి అందరూ వెళ్లిపోండి నేనే వస్తానని కార్తీక్ అంటాడు. అందరు వెళ్ళిపోతారు. మీరేం మాట్లాడతారో నాకు తెలుసు.. అందుకే పంపించానని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే స్వప్న కాల్ చేసి.. మీ అడ్రెస్స్ పెట్టు.. దీప అంత చెప్పిందని అంటుంది. వద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతంలు సుమిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి పారిజాతం కొడుకు దాస్ తప్పు చేసాడని తాతయ్య పంపించాడు కదా.. తప్పు చేసిన వాళ్లకు ఇంట్లో స్థానం లేదన్నారు కదా మరి దీపకి ఎందుకు ఉందని సుమిత్రని అడుగుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.