English | Telugu

అప్పుడు పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు నిఖిల్!

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే అది అలాంటి ఇలాంటి లవ్ కాదు. వాడేసుకుని.. ఆడేసుకునే లవ్.. అర్థం కాలేదు కదా..మ్యాటర్ ఏంటంటే సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ మొదట రతికతో చిన్నగా లవ్ ట్రాక్ నడిపించాడు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఆటని దెబ్బతీసింది. దాంతో అతను తొందరగా తన తప్పు తెలుసుకొని రతికని పక్కన పెట్టేసి గేమ్ మీద దృష్టి సారించి విజయం సాధించాడు.

ఇక ఇప్పుడు అదే జరుగుతుంది. ఫస్ట్ వీక్ నామినేషన్ లో భాగంగా నిఖిల్ ని నామినేట్ చేసిన సోనియా ఆకులని చూసి అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు‌. ఇక నిఖిల్ కాస్త స్ట్రాంగ్ గా ఉండేసరికి తనకి హెల్ప్ అవుతాడని తనతో చిన్నగా ప్రేమాయణం నడిపించింది సోనియా. చేతిలో చేయి వేసి మాట్లాడటం.. ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం.. ఇంకా సిగరెట్ మానేస్తే ఏది కావాలన్నా ఇస్తానని నిఖిల్ తో సోనియా చెప్పడం.. ఇదంతా చూసి నిఖిల్ తన ట్రాక్ లో వచ్చేశాడు‌. నిఖిల్ లో ఫస్ట్ వీక్ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ వీక్ లేదనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గేమ్ ని కన్ ఫ్యూజ్ చేయటానికే సోనియా ఇలా చేసిందా అని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు. సెవెన్ లో‌ రతిక కూడా పల్లవి ప్రశాంత్ ని ఇలానే వాడుకోవాలని చూసింది. ఇప్పుడు నిఖిల్ కూడా సోనియా ఖాతాలో బలి కానున్నాడా తెలియాల్సి ఉంది.

అయితే సోనియా మాత్రం తను వేరేనంటూ చెప్పుకొచ్చింది. మొన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియని పర్సనల్ గా తిట్టేసిన సోనియా.. నిఖిల్ తో అంత క్లోజ్ గా ఉంటే ఎవరేం అనుకోవడం లేదా అని ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే నిఖిల్ తన గేమ్ ని స్టార్ట్ చేస్తాడా లేక సోనియా కోసం వీక్ అవుతాడా అనేది ముందు మందు చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.