English | Telugu
తెలుగు బిగ్ బాస్ లో కన్నడ బ్యాచ్ సైకోయిజం...
Updated : Sep 13, 2024
బిగ్ బాస్ హౌస్ లో గురువారం నాటి ఎపిసోడ్ లో కన్నడ బ్యాచ్ సైకోయిజం బయటపడింది. ప్రైజ్ మనీ కోసం హౌస్ లో బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తుంటే యష్మీ, పృథ్వీ, సోనియా, నిఖిల్ , ప్రేరణ తమ గ్రూప్ గేమ్ తో మిగిలిన హౌస్ మేట్స్ ని తొక్కేస్తున్నారు.
ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్‌ని బాగా విసిగిస్తూ, ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. గత సీజన్‌లో అయితే శోభాశెట్టి దెబ్బకి కంటెస్టెంట్లు దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు. ఇక ఈ సీజన్‌లో శోభాశెట్టి నా ముందు జుజుబీ అన్నట్లుగా అంతకుమించి సైకోయిజం చూపిస్తుంది యష్మీ. ఇక యష్మీ తానా అంటే తందనా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వీ. ఇక వీళ్లద్దరికీ శాడిజంలో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన ప్రతీ టాస్క్ లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, సోనియా ఒకే వైపు ఉండి ఆడారని తెలుస్తోంది. లాస్ట్ టాస్క్ అయినటువంటి సాక్స్ రిమూవింగ్ టాస్క్ లో భాగంగా కిర్రాక్ సీత, నైనిక, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ, అభయ్ నవీన్, నిఖిల్ పాల్గొనగా ప్రేరణ సంఛాలక్ గా వ్యవహరించింది. దాంతో గేమ్ మొత్తం ఏకపక్షంగా మారింది. పృథ్వీ ఆడినంత సేపు ఫౌల్ గేమ్ ఆడాడు.
ఇక ప్రేరణ అది గుర్తించి పృథ్వీని బయటకు పంపించింది. అయితే బయటకొచ్చిన పృథ్వీ, యష్మీ అక్కడే ఉన్న సోనియాతో కలిసి బాక్స్ లోపల ఉన్న నిఖిల్ , అభయ్ లకి సపోర్ట్ చేశారు. ఇక విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, కిర్రాక్ సీత లాంటి వాళ్లని అలగేషన్ చేసి బయటకు పంపించేశారు. ఇక చివరి వరకు నిఖిల్, అభయ్ ఉండగా బజర్ మోగింది. ఇక ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు. ఇక ఈ ఎపిసోడ్ లో పృథ్వీ, యష్మీ చేసిన వెక్కిలి చేష్టలు చిరాకు తెప్పించాయి. గత సీజన్ లో శోభా శెట్టిని ఆడియన్స్ ఎంత తిట్టుకున్నారో ఇప్పుడు యష్మీని అదే రేంజ్ లో తిట్టుకుంటున్నారు.