English | Telugu

Brahmamudi : గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేయడానికి కోయిలి ప్లాన్.. ఒకే చెప్పిన రంజిత్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 870 లో..క్లయింట్ కి  ఇవ్వాల్సిన కొటేషన్ సిస్టమ్ లో లేదని సుభాష్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సుభాష్ టెన్షన్ పడతాడు. ఒకవేళ క్లయింట్ వెళ్ళిపోతే యాభై కోట్ల లాస్ వస్తుందని రాజ్ కి సుభాష్ కాల్ చేసి చెప్తాడు. వెంటనే అక్కడ నుండి బయల్దేరండి అని సుభాష్ చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యకి విషయం చెప్పి మనం ఇప్పుడు బయల్దేరాలని చెప్తాడు. అవసరం లేదు ఆ కొటేషన్ నా సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టానని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ రిలాక్స్ అవుతాడు.

Bigg Boss 9 Telugu: సుమన్ శెట్టి రెబల్.. ఇరగదీశాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో‌ సుమన్ శెట్టి ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం సుమన్ శెట్టినే కంటెంట్ ఇచ్చాడు. అతని ఆటకి దివ్య తోడైంది. ఇద్దరు కలిసి టాస్క్ ని పూర్తి చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో అందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా ఒక మూల టెలిఫోన్ చూసి హౌస్‌మేట్స్ అవాక్కయ్యారు. వెంటనే తనూజ వెళ్లి ఇంట్లో నుంచి మనకి ఫోన్స్ వస్తాయేమోనంటూ గెంతులేసింది. ఇక ఫోన్ రింగ్ అవ్వగానే తనూజనే లిఫ్ట్ చేసింది. అయితే తీరా అది బిగ్‌బాస్ మాట్లాడటానికే పెట్టాడు. తనూజ.. మీ చుట్టూ ఉన్న వాళ్లందరూ మన మాటలు వింటున్నారు.. వాళ్లందరినీ దూరంగా వెళ్లమనండి.. నేను మీకు ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారని బిగ్‌బాస్ అడిగాడు. బిగ్‌బాస్ మీరు అడిగారు కదా మీ విషెస్ ఏమైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని దాని గురించి అయి ఉంటుందని అనుకుంటున్నానని తనూజ చెప్పింది. లేదు మీరు తప్పు గెస్ చేశారు.. ఇప్పటినుంచి కంటెండర్‌షిప్ టాస్క్ మొదలైంది.. ఈ విషయాన్ని అందరికి చెప్పండని బిగ్‌బాస్ అన్నాడు. ఈ విషయం తర్వాత హౌస్‌మేట్స్‌ కి చెప్పినా వాళ్లు పెద్దగా నమ్మలేదు. ఇదేదో సీక్రెట్ టాస్క్ అనుకున్నారు. కాసేపటి తర్వాత రీతూతో కూడా ఫోన్‌లో మాట్లాడాడు బిగ్‌బాస్. నెక్స్ట్ రూల్స్ చెప్పాడు.

Karthika Deepam2 : దీపని సొంతకూతూరిలా చూసుకుంటున్న దశరథ్, సుమిత్ర.. హర్ట్ అయిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -506 లో..... సుమిత్ర వచ్చి జ్యోత్స్నతో మాట్లాడుతుంది. సుమిత్ర మాటలు జ్యోత్స్నకి చెంపపెట్టులాగా అనిపిస్తాయి. ఇప్పటివరకు మీ అమ్మ మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే అసలైన వారసురాలు ఎవరో తెలుసుకొని నిన్ను ఇంట్లో నుండి గెంటెస్తారనిపిస్తుందని జ్యోత్స్నతో పారిజాతం అనగానే  జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇంకా బయపెట్టకు గ్రానీ అని తనపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఇక ఆ తర్వాత అందరు భోజనానికి కూర్చొని ఉంటారు.

మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు ఒక్కసారన్నా

జయమ్ము నిశ్చయమ్మురా సెలబ్రిటీ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక న్యూ ఎపిసోడ్ కి ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చింది.  జగపతి బాబు ఆమె ఎన్నో ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ షోలో మరో ఇంటరెస్టింగ్ సెలబ్రిటీ కూడా యాడ్ అయ్యారు. ఆయనే రాహుల్ రవీంద్రన్. "మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు అని ఫీలైనట్టున్నావ్" అని జగపతి బాబు అడిగేసరికి "ఎస్..మగాళ్లకు ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే అబ్బాయిలకు రావాలి" అని చెప్పింది. దానికి ఆడియన్స్ అలాగే హోస్ట్ జగపతి బాబు కూడా చప్పట్లు కొట్టారు. "స్కూల్ లో పేరెంట్, టీచర్ మీటింగ్ లో ఒక కంప్లైంట్ వచ్చిందట ఏంటది" అని జగ్గు భాయ్ అడిగారు.

అఖిల్ సార్థక్ కి సర్‌ప్రైజ్‌ చేసిన మోనాల్

బిగ్ బాస్ సీజన్ 4 అంటే చాలు ముందు గుర్తొచ్చేది అఖిల్ సార్థక్, మోనాల్ గుజ్జర్. ఈ బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ దూరమైపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు అఖిల్ సార్థక్ తో కలిసి వాళ్ళ సలోన్ కి వచ్చింది. అలాగే లైవ్ లోకి వచ్చింది. కాసేపు ఫాన్స్ తో మాట్లాడారు. అల్లరి నరేష్ నటించిన "సుడిగాడు" అనే మూవీతో మోనాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ చేసింది. ఇక తర్వాత ఆమె గుజరాత్ వెళ్ళిపోయి అక్కడ గుజరాతి మూవీస్ లో నటిస్తోంది. ఇక అఖిల్ కి కూడా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ వీడియోని, పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.  "చాలా ధన్యవాదాలు, సర్‌ప్రైజ్‌చేసినందుకు...కొంతకాలంగా నేను చాలా నిరుత్సాహంగా ఉంటున్నాను.