English | Telugu

రష్మికకి హ్యాపీ మారీడ్ లైఫ్ అని చెప్పిన గీతూ రాయల్


బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ సోషల్ మీడియాలో మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తూ ఉంటుంది. అలాంటి గీతూ రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీ హీరోయిన్ రష్మిక బైట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే "గర్ల్ ఫ్రెండ్" మూవీ సక్సెస్ మీట్ లో మీరు ఎం చెప్పారు అంటే ప్రతీ ఒక్కరి లైఫ్ లో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పారు. మరి మీ లైఫ్ లో విజయ్ దేవరకొండ ఏంటి" అని గీతూ రాయల్ అడిగింది. "అతను నా బెస్ట్ ఫ్రెండ్" అని రష్మిక మందన్నా చెప్పింది. వెంటనే గీతూ రాయల్ "హ్యాపీ మారీడ్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్" అని విషెస్ చెప్పింది. "మీరు అసలు ఎం మాట్లాడుతున్నారో నాకేం అర్ధం కావడం లేదు" అని చెప్పింది రష్మిక. ఆ కామెంట్ కి ఓకే అని చెప్పింది గీతూ.

ఈ వీడియో మీద కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. "అంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు గీతూ నువ్వు పర్సనల్ గా వెళ్తావు వాళ్ళే చెప్తారు కదా..అతనే ఆమె కామ్రేడ్..రష్మిక ఎవరు అడిగిన బైట్ ఇస్తుంది. " అంటూ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ 7 బజ్ కి గీతూ హోస్ట్ గా చేసింది. "ఆ కన్ను గీటడమే అన్నీ విషయాలు చెబుతుంది. ఆమె చాలా అందమైన అమ్మాయి. ఆమె జీవితంలో ముందుకు సాగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమె కంటే అందంగా ఆమె ప్రయాణం ఇంకా అందంగా ఉండాలని" అంటూ విష్ చేసింది గీతూ.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.