English | Telugu

Brahmamudi : భార్యని డిన్నర్ కి తీసుకెళ్ళిన భర్త.. ‌అక్కడ రౌడీలతో గొడవ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -878 లో.. రాజ్ లవ్ లెటర్ లో మొత్తం ఆఫీస్ గురించి రాస్తాడు. ఇక సుభాష్ అయితే అపర్ణని వంటిల్లుకి పరిమితం చేస్తాడు. ఇక మిగిలింది ప్రకాష్.... చిన్న మావయ్య గారు ఎలా రాశాడో చదవండి అత్తయ్య అని ధాన్యలక్ష్మితో కావ్య అంటుంది. ప్రకాష్ మిగతా ఇద్దరి కంటే లవ్ లెటర్ బాగా రాస్తాడు కానీ చివర్లో ధాన్యలక్ష్మి పేరు కాకుండా లత అనే పేరు రాస్తాడు. ఈ లత ఎవరు అని ధాన్యలక్ష్మికి కోపం వచ్చి ప్రకాష్ వెంట పరుగెడుతుంది. దాంతో అందరూ నవ్వుకుంటారు.

మరొకవైపు నేను స్వప్నని నమ్మించడానికి నిజంగా కష్టపడినట్లు యాక్టింగ్ చెయ్యాలని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఆ తర్వాత స్వప్న దగ్గరికి రాహుల్ వెళ్లి.. స్వప్న నేను వర్క్ చెయ్యడానికి వెళ్తున్నాను.. రాత్రి నీకు సర్ ప్రైజ్ ఉందని చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. వాడిని నమ్మి మళ్ళీ మోసపోకూ అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత నాకు చీర కట్టండి అని రాజ్ తో కావ్య అంటుంది. దాంతో రాజ్ చీర కట్టడానికి ట్రై చేస్తాడు. కావ్యకి దగ్గరగా వెళ్లి కిస్ ఇవ్వాలని చూస్తాడు కానీ కావ్య ఆపుతుంది.

మరొకవైపు ప్రకాష్ కి యాంటీ మెంట్ రాస్తు ఇంతకు ఆ లత ఎవరు అని ధాన్యాలక్ష్మి అడుగుతుంది. ఎందుకు నాన్న వేరొక అమ్మాయి పేరున లెటర్ రాసి అమ్మకి ఇచ్చావని ప్రకాష్ తో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్యను తీసుకొని రాజ్ క్యాండీ లైట్ డిన్నర్ కి వెళ్తాడు. తరువాయి భాగం లో రాహుల్ బేరర్ గా వర్క్ చెయ్యడం చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. అక్కడ కావ్యని రౌడీ లు ఏడిపిస్తారు. దాంతో వాళ్ళని రాజ్ కొడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.