English | Telugu

ఏడాదిలో రెండు సీజన్స్ ...అదే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే 

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ కే సీజన్ 5 నవంబర్ 20 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ షో గ్లిమ్ప్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆహా. ఇక హోస్ట్ గా సుమ కనకాల వచ్చింది. ఇక రుచి చూసి మార్క్స్ వేసే నటుడు, చెఫ్ జీవన్ కుమార్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. "ఆడియన్స్ కోరిక మేరకు ఒకే సంవత్సరంలో రెండు సీజన్స్ ని మొదలుపెట్టినటువంటి ఏకైక షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే" అని చెప్పింది సుమ. ప్రతీ గురువారం ఒక న్యూ ఎపిసోడ్ ని ప్రసారం చేయబోతోంది ఆహా. "మళ్ళీ ఆడియన్స్ కోసం వంటగది రెడీ ఐపోయింది. కొంచెం గందరగోళంతో బోల్డంత కామెడీతో మీకు తెలిసిన వాళ్లంతా చెఫ్స్ గా రాబోతున్నారు. వారి వంటల స్కిల్స్ చూసి మీరు కచ్చితంగా షాకవ్వాల్సిందే.

నవంబర్ 20 నుండి సాయంత్రం 7 గంటలకు చెఫ్ మంత్ర సీజన్ 5 " అంటూ ఆహా చెప్పుకొచ్చింది. కావ్యశ్రీ, ప్రేరణ, యాదమ్మ రాజు, అఖిల్ సార్ధక, మానస్, పండు, యాష్మి, దీపికా, టేస్టీ తేజ, ప్రియదర్శి అందరూ ఈ షోలో కనిపించారు. ఇక నెటిజన్స్ ఐతే "కావ్య - ప్రేరణ, యాష్మి కోసమే ఈ షో చూడాలి..ఈ షోలో తేజస్విని గౌడ కావాలి..యాష్మి టిఆర్పి క్వీన్.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ షో సీజన్ 4 వచ్చి గ్రాండ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు ఏడాది చివరిలో కొత్త సీజన్ కి గ్రాండ్ లాంచ్ చేసుకోబోతోంది. ఇప్పటి వరకు ఇలా ఏడాదిలో రెండు సీజన్స్ స్టార్ట్ ఐన షో అనేదే లేదు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.