English | Telugu

Jayam serial : శకుంతలతో పైడిరాజు సవాల్.. గంగకి పెళ్లి చేస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో.. గంగ కట్టుకున్న చీరని పారు కాల్చేస్తుంది. అప్పుడే పైడిరాజు తాగి రుద్ర ఇంటికి వస్తాడు. తనని ఆపడానికి లక్ష్మీ, గంగ వెంటే వస్తారు. పైడిరాజు గొడవ చేస్తాడు. దాంతో ఇంట్లో అందరు బయటకు వస్తారు. ఎవరు అతను అని ఇషికని పారు అడుగుతుంది. ఎందుకు వచ్చావని పైడిరాజుని శకుంతల అడుగుతుంది. నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారని పైడిరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నావని శకుంతల కోప్పడుతుంది. గంగ గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంది. రుద్ర కుటుంబం గురించి పైడిరాజు తప్పుగా మాట్లాడుతాడు.. అప్పుడే వీరు వచ్చి పైడిరాజుపై కోప్పడతాడు.

నీ కూతురిని కంట్రోల్ చెయ్ అని వీరు అంటాడు. నీ లాగా తిన్నింటి వాసాలు లెకపెట్టే రకం కాదని వీరుతో గంగ అనగానే నోరు ముయ్ నా అల్లుడిని ఆలా అంటావా అని శకుంతల కోప్పడుతుంది. నీ కూతురు మా బావని ఇంప్రెస్ చెయ్యడానికి తన చుట్టూ తిరుగుతున్న బాక్సింగ్ నేర్చుకుంటుందని పైడిరాజుతో వీరు చెప్తాడు. నీకు దమ్ముంటే నీ కూతురికి పెళ్లి చేసి పంపించమని శకుంతల అనగానే ఖచ్చితంగా చేస్తాను అని పైడిరాజు చెప్తాడు. ఇప్పుడే గంగకి పెళ్లి వద్దు.. పోటీ తర్వాత చెయ్యండి ఎందుకంటే నా రుద్ర తనని పోటీకి సిద్ధం చేస్తున్నాడు కదా అని రుద్రకి ఫేవర్ గా పారు మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంది.

ఆ తర్వాత వీరు, పారు, ఇషిక ముగ్గురు బయటకు వస్తారు. ఇందంతా చేసింది మేమే అని పారుకి ఇద్దరు చెప్తారు. అలాగే మణిని పిలిచి ఇక గంగని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డు లేదని వీరు చెప్తాడు. మరొకవైపు నా పరువు తీసావ్.. ఇంత జరిగాక నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని గంగతో పైడిరాజు అంటాడు. నేను చేసుకుంటానని మణి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.