English | Telugu

Brahmamudi : రాహుల్, కావ్యల మాటలకి టెంప్ట్ అయిన కోయిలి.. రంజిత్ చూసేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -866 లో...... రంజిత్, కోయిలి మాట్లాడుకుంటారు. ఎలాగైనా ఆ ఇంటికి కోడలు అయి ఆస్తులన్నీ లాగేసుకుంటానని రంజిత్ తో కోయిలి అంటుంది. అప్పుడే రాహుల్ బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి రాహుల్ ఈ టైమ్ లో వచ్చావ్.. చేతిలో ఈ బ్యాగ్ ఏంటని రాహుల్ ని కోయిలి అడుగుతుంది. నన్ను అక్కడ అర్ధం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.. అందుకే అక్కడ నుండి వచ్చేసానని రాహుల్ అనగానే అలా ఎందుకు వచ్చావ్.. నీ కుటుంబం చూసే కదా నేను నిన్ను లవ్ చేసింది అని కోయిలి అనగానే రాహుల్ షాక్ అవుతాడు.

Karthika Deepam2 : ఇంటికి తిరిగొచ్చిన సుమిత్ర.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -503 లో.....సుమిత్ర కన్పించడం లేదని జ్యోత్స్న కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీపని అరెస్ట్ చేస్తారు. దీపతో కాంచన కూడా స్టేషన్ కి వస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్నపై కోప్పడతాడు. మా మమ్మీని ఈ దీప కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది. అందుకు ఆధారాలు ఉన్నాయా అని శివన్నారాయణ అడుగుతాడు. తనే చేసిందని జ్యోత్స్న అంటుంది. ఇన్‌స్పెక్టర్ మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఇన్‌స్పెక్టర్ ని శివన్నారాయణ అడుగుతాడు..